డిప్రెషన్ లో జలీల్ ఖాన్?

డిప్రెషన్ లో జలీల్ ఖాన్?

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు తన మంత్రివర్గంలో మైనారిటీలకు చోటివ్వని టిడిపి అధినేత చంద్రబాబు తాజా మంత్రివర్గ విస్తరణలో..తెలుగుదేశం పార్టీకి చెందిన మైనార్టీ నేత సీనియర్ నాయకుడు ఫరూక్ ని తీసుకోవడంతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ నుండి టీడీపీ లోకి వెళ్ళిన జలీల్ ఖాన్ బాబు గారు తీసుకున్న తాజా నిర్ణయంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున గెలిచి తర్వాత టీడీపీ లోకి వెళ్ళిన జలీల్ ఖాన్ చంద్రబాబు గతంలో మంత్రి పదవి ఇస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు..అయితే చంద్రబాబు తాజా నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు జలీల్ ఖాన్.
 
గతంలో చంద్రబాబు జలీల్ ఖాన్ కి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ పదవితో సంత్రుప్తి చెందని జలీల్ ఖాన్ మంత్రి పదవి కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్ని చేసినా కానీ చంద్రబాబు తన పార్టీని నమ్ముకుని ముందునుండి ఉన్న ఫరూక్ కి మంత్రి పదవి ఇవ్వటంతో జలీల్ ఖాన్ కు ఎదురు దెబ్బె తగిలిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామం వచ్చే ఎన్నికలలో ఎంతో ప్రభావం చూపుతుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా జలీల్ ఖాన్ కు టిక్కెట్టు దక్కె అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలే అని టాక్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top