తెలంగాణా లో పోటీ చెయ్యము అని ప్రకటించిన వైకాపా !

తెలంగాణా లో పోటీ చెయ్యము అని ప్రకటించిన వైకాపా !

జనసేన - వైకాపా పార్టీ లు తెలంగాణా లో తమ స్టాండ్ ఏంటి అనేది చెప్పే సమయం వచ్చేసింది. సరిగ్గా పాతిక అంటే పాతిక రోజుల్లో అక్కడ ఎలక్షన్ షురూ అవుతోంది. డిసెంబర్ ఏడు న అక్కడ పోలింగ్ కి సర్వం సిద్ధం చేసుకున్నారు ఎలక్షన్ అధికారులు. అయితే ఈ నేపధ్యం లో వైకాపా అక్కడ పోటీ చెయ్యడం లేదు అనే నిర్ణయానికి వచ్చింది . తెలంగాణా ప్రాంతం లో క్యాడర్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంది అనీ వచ్చే ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లోనే తాము పోటీ చేస్తాం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 2019 లో జరగబోయే ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల విషయం లో మాత్రమే పోటీ చేస్తాం అనీ ఇక్కడ ధీటుగా టీడీపీ ని ఎదురుకోవడం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం అని తెలిపారు వైకాపా ప్రతినిధులు.
 
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top