ప్రజలు తలుచుకుంటే నేనే సీఎం అవుతా: పవన్ కళ్యాణ్

By Xappie Desk, November 13, 2018 11:26 IST

ప్రజలు తలుచుకుంటే నేనే సీఎం అవుతా: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొలది అధికార పార్టీ తెలుగు దేశం కి మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ కి దిమ్మతిరిగిపోయే రాజకీయాన్ని ప్రదర్శిస్తూ మరొకసారి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏటువంటి స్థాయిలో ప్రజా క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుందో ప్రస్తుతం చేస్తున్న ప్రజాపోరాట యాత్రలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు పవన్. గత కొన్నాళ్ల నుండి తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ను బహిరంగ సభలలో ను తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు పవన్.
 
ఈ క్రమంలో ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఏపీలో పలు సమస్యలపై లేవనెత్తారు. ప్రజలే దీవెనలే తనను ముఖ్యమంత్రిని చేస్తాయని పవన్ అన్నారు. ఉద్దానంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్దానంలో పరిస్థితిపై ఎంపీలు ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు. ప్రజలకు, యువతకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలన్నీ అమరావతిలో పెడితే ఎలా? అని పవన్ ప్రశ్నించారు. మళ్లీ ప్రాంతీయ వాదం పుట్టుకురావడం ఖాయమని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇంతటి దారుణమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులు రాజకీయాల్లో ఉంటే ప్రజల మధ్య అసమానతలు ఎదురవుతాయని భావితరాలకు అన్యాయం చేసిన రాజకీయ నాయకులు అవుతామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్.Top