జగన్ భద్రత విషయంలో భారీ మార్పులు..!

By Xappie Desk, November 13, 2018 11:30 IST

జగన్ భద్రత విషయంలో భారీ మార్పులు..!

హత్యాయత్నం జరిగిన తర్వాత జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన నేపథ్యంలో విజయనగరం ప్రాంతానికి చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు జగన్ కి భద్రత కేటాయించడంలో కట్టుదిట్టం అయ్యారు. గతంలో విశాఖ పట్టణం విమానాశ్రయంలో ముమ్మిడివరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో దారుణంగా హత్యాయత్నం చేయటంతో తీవ్రంగా గాయపడిన జగన్ దాదాపు 17 రోజులు పాటు ప్రజా సంకల్ప పాదయాత్ర కి బ్రేక్ ఇచ్చి లోటస్ పాండ్ లో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. దీంతో మళ్లీ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పున ప్రారంభించారు విజయనగరం జిల్లా మక్కువ మండలం పాయకపాడు నుంచి జగన్ తన పాదయాత్రను పున:ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగన్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీస్ సెక్యురిటీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రీన్, బ్లూ, రెడ్ విభాగాలుగా సెక్యూరిటీని విభజించారు. జగన్‌ను కలుసుకోవాలనుకునే వారి కోసం రెడ్ కార్డులను ఇష్యూ చేశారు.
 
అలాగే జగన్‌ను అనుసరించే ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర సిబ్బందికి బ్లూ కార్డులు, బందోబస్తులో ఉన్న పోలీసులకు గ్రీన్ కార్డులను ఇచ్చారు. ఇలా జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా పాదయాత్రలో ప్రతి స్థలం తమ పర్యవేక్షణలో ఉండేటట్లు సాంకేతిక పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. మరోపక్క జగన్ కూడా పాదయాత్ర లో తనదైన శైలిలో దూసుకెళ్లి పోతున్నాడు...హత్యాయత్నం జరిగిన కానీ జగన్ పాదయాత్ర ఆపకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కి చుక్కలు చూపిస్తూ జనం లోకి వస్తున్న నేపథ్యంలో పబ్లిక్ కూడా గతంలో కంటే ఎక్కువగా జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు.Top