బాబుకి షాక్ ఇచ్చిన పరిటాల ఫ్యామిలీ !

By Xappie Desk, November 13, 2018 11:38 IST

బాబుకి షాక్ ఇచ్చిన పరిటాల ఫ్యామిలీ !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి తమ పార్టీ వర్గాల నుండి విపరీతమైన వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. చంద్రబాబు లాగా అధికారం కోసం మరి ఇంతలా దిగజారిపోవడం తమకు తెలియదని పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పక్క చూపులు చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ తో కలిసిన టీడీపీని చూసి వారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాబుతో కలిసి నడవలేక వారి పార్టీ నేతలే వారి దారి వారు చూసుకుంటున్నారు. కొత్త రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకుంటున్న వాళ్ళు బాబు తీరుపై పోరు మొదలుపెట్టారు.
 
ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా నుండి టీడీపీకి అతి పెద్ద షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్ రాముడు, పరిటాల సునీత ప్రముఖ అనుచరుడు చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వాళ్లు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అనేకానేక చర్చలకు దారి తీశాయి. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసిన విషయం విని తమ కలత చెందామని వారు చెప్పుకొచ్చారు. అయితే అనంతపురంలో పరిటాల ఫ్యామిలీదే హవా అంతా. ఇప్పుడు వారి మద్దతుతో నెగ్గిన వెంకట్ రాముడు మరియు అనుచరుడు మధుసూదన్ రెడ్డి ఇలా చేయడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇక వీరైతే, తాము 1989 నుండి టిడిపిలో ఉన్నామని, కాంగ్రెస్ కు ప్రతికూలంగా జీవం పోసుకున్న టీడీపీని కాంగ్రెస్ లో కలపడం స్వర్గీయ ఎన్టీఆర్ గారికి ఆత్మక్షోభ అని అన్నారు. తమ భవిష్యత్తు పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పిన వీరి గురించి జిల్లా టిడిపి వర్గాల నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పటికే మంత్రి పదవి ఉన్న పరిటాల సునీతతో వీరు చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారా అన్నది అందరి అనుమానం. ఒకవేళ ఆమెకి అంతా తెలిసే జరిగుంటే తరువాత సునీత పై రామ్ ఎటువైపు అనేది ఇక్కడ ప్రశ్న. ఇకపోతే కాంగ్రెస్ లో చాలామందికి కూడా టిడిపితో పొత్తు నచ్చలేదు. త్వరలోనే చిరంజీవి కూడా పార్టీ వీడనున్నారట. ప్రస్తుతానికైతే ఏపీ రాజకీయoలో వలసలు ఎక్కువైపోయాయి అనే చెప్పాలి.Top