చంద్రబాబు విషయం లో జాగ్రత్త కోదండరాం !

By Xappie Desk, November 13, 2018 11:41 IST

చంద్రబాబు విషయం లో జాగ్రత్త కోదండరాం !

తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమిలో భాగమైన తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం కి చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు మరియు తెలంగాణ మేధావులు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు సూచిస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో టీజేఎస్ పార్టీని ప్రేమించేవారు తెలుగుదేశం పార్టీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే బాబు వేసే ప్రతివ్యూహాలకు తట్టుకునేలా నిలబడాలని చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని కి మహా మహా నాయకులు - పార్టీలే కుదేలయ్యారని గుర్తు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తన రాజకీయ స్వలాభం కోసం ఇటువంటి దారుణానికైనా దిగజారే వ్యక్తిత్వం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు... తన కోసం - తన ఉనికి కోసం ఎలాంటి కార్యక్రమానికైనా వెనుకాడరని - దీనికి తన సొంత కుటుంబమే పెద్ద తార్కాణమని చెబుతున్నారని సమాచారం. ఆయనతో నేరుగా మాట్లాడకపోయినా ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు తన చక్రం తిప్పుతారని - దీనికి బలి కాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. " చంద్రబాబు నాయుడు జిత్తుల మారి. తన అవసరం కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు.దీనికి గత అనుభవాలే తార్కాణం. చివరికి తన భద్రత కోసం - మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించి తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడితో జాగ్రత్తగా వ్యవహరించండి" అని కొందరు మేథావులు కోదండరాం కి సూచిస్తున్నట్లు సమాచారం.Top