తెలుగుదేశం పార్టీ కి షాక్ ఇచ్చిన ఎంపీ జనసేనలోకి జంప్..?

By Xappie Desk, November 13, 2018 11:45 IST

తెలుగుదేశం పార్టీ కి షాక్ ఇచ్చిన ఎంపీ జనసేనలోకి జంప్..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరోపక్క ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో తెలుగుదేశంలో అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీలో ఉండి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ పెద్దలకు షాక్ ఇస్తూ ఇటీవల చాలా మంది నేతలు వైసీపీ మరియు జనసేన పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తాజాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు తోట నరసింహ రావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేట నుండి పోటీ చేయాలని భావించిన నేపథ్యంలో..ఆ స్థానం రాకపోవడంతో పార్టీ మారడానికి రెడీ అయినట్లు సమాచారం.
 
ఈ క్రమంలో జగ్గంపేట టికెట్ ను జ్యోతుల నెహ్రూ కి కేటాయించామని నారా లోకేష్ ప్రకటన చేయడంతో...అసంతృప్తి చెందిన తోట న‌ర‌సింహం కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో తోట న‌ర‌సింహం వైసీపీలో చేర‌నున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయ‌న జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
 
ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని.. ప‌వ‌న్ కూడా తోట న‌ర‌సింహం కోరిన స్థానంలో టిక్కెట్ ఇవ్వ‌డానికి ఓకే చెప్పార‌ని.. దీంతో త్వ‌ర‌లోనే ఈ టీడీపీ ఎంపీ జ‌న‌సేన‌లోకి జంప్ అవ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఇప్పటికే దారుణమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితుల్లో టీడీపీ ఎంపీ తోట నర్సింహం జనసేన లో చేరితే అది తెలుగుదేశం పార్టీకి తీరని దెబ్బ అని చాలామంది రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.Top