చంద్రబాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి..!

By Xappie Desk, November 13, 2018 11:51 IST

చంద్రబాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి..!

అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. రాబోయే 20 సంవత్సరాలు చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా చంద్రబాబు తన అనుభవం చేత నష్టపోయిన రాష్ట్రంలో అనేక పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారని రానున్న ఎన్నికల్లో ప్రజలంతా కలిసి మళ్ళీ చంద్రబాబు కే పట్టం కట్టాలని అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
 
అంతేకాకుండా భవిష్యత్తు రాజకీయాలు గురించి మాట్లాడుతూ..తనకు రాజకీయాల మీద ఆసక్తి తగ్గిందని రాబోతున్న ఎన్నికల్లో త‌న కొడుకు అశ్మిత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించ‌నున్నాన‌ని ప్ర‌భాక‌ర్ రెడ్డి అన్నారు. తాడిప‌త్రి ప్ర‌జ‌లు త‌మ కుటుంబాన్ని 40 ఏళ్ళుగా ఎంతో ఆద‌రించి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నార‌ని, వారికి త‌మ కుంటుబ స‌భ్యులు ఎంతో రుణ‌ప‌డి ఉంటామ‌ని, త‌మ వ‌ల్ల ఎవ‌రైనా నొచ్చుకొని ఉంటే క్ష‌మించాల‌ని స‌భాముఖంగా ప్ర‌భాక‌ర్ రెడ్డి కోరారు. ఇక చివ‌రిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలిపారు.Top