ఉత్తం కుమార్ రెడ్డి రాజకీయ చదరంగం మామూలుగా లేదు !

ఉత్తం కుమార్ రెడ్డి రాజకీయ చదరంగం మామూలుగా లేదు !

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మకం గా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు ముందు నుండి అందుబాటులో ఉంటూ టీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందుండి నడిపించిన పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న రెండు అసెంబ్లీ ఎన్నికలలో తనదైన శైలిలో రాజకీయ చదరంగాన్ని నడిపిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ముందుండి పని చేసిన ప్రతి కుటుంబానికి కేవలం ఒక్క సీటు కేటాయిస్తే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని ఢిల్లీలో వ్యక్తం చేసి తన కుటుంబానికి రెండు సీట్లు తెప్పించుకున్నారు ఉత్తంకుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఆయనకు హుజూర్ నగర్ ఆయన భార్య పద్మావతికి కోదాడ వీటిని కేటాయించింది కాంగ్రెస్. ఇదే క్రమంలో నల్గొండ జిల్లాలో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి నమ్మకం గా పని చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ కు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు కేటాయించడం విశేషం. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు తమకి కూడా కాంగ్రెస్ అధిష్టానం రెండు సీట్లు కేటాయిస్తుందని భావించిన చాలామంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు..కొంతమందికి మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం సీట్లు కేటాయించడం తో ఢిల్లీ పెద్దలతో అసంతృప్తి గా ఫీల్ అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కొండా సురేఖ రెండు సీట్ల హామీతోనే కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు పరకాల ఇచ్చి .. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఉన్న వరంగల్ తూర్పును కేటాయించకపోవడంతో షాక్ కు గురయ్యారట.. ఇక దామోదర భార్యకు కూడా సీటు ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదట.. ఇలా కొందరిపై కాంగ్రెస్ అధిష్టానం వల్లమాలిన ప్రేమ కురిపించి.. మరికొందరిపై సవితి ప్రేమ చూపించడంపై నేతలు మండిపడుతున్నారు
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop