టీడీపీ తెలంగాణా జాబితా ఇదిగో !

టీడీపీ తెలంగాణా జాబితా ఇదిగో !

తెలంగాణ రెండు అసెంబ్లీ ఎన్నికలకు మహాకూటమి అన్ని విధాల రెడీ అయిపోయినట్లు ముఖ్యంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఏర్పడిన మహాకూటమిలో ప్రస్తుతం టిడిపి జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీచేసే తొమ్మిది మంది వ్యక్తుల పేర్లు ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కి ముందు నుండి తెలంగాణ రాష్ట్రంలో నమ్మకం గా పని చేస్తున్న టిడిపి తెలంగాణ అధ్యక్షుడు రమణకి టికెట్ లేకుండా పోయింది. ఎల్ రమణ ఎన్నో ఏళ్లుగా పోటీచేస్తున్న స్థానం జగిత్యాలలో కాంగ్రెస్ తరఫున టీ. జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ శాసన సభా పక్ష ఉపనేత. దాంతోపాటు బలమైన క్యాండిడేట్. అనాదిగా రమణ వర్సెస్ జీవన్ రెడ్డి ఫైట్ కొనసాగేది. కూటమి కట్టడంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ నేపద్యం లో జీవన్ రెడ్డిపై కవిత టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి రెడీ అయింది. ఈ క్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
 
1.ఖమ్మం  - నామా నాగేశ్వరరావు
 
2. సత్తుపల్లి- సండ్రవెంకట వీరయ్య
 
3. అశ్వారావుపేట- మచ్చ నాగేశ్వర రావు
 
4. వరంగల్ పశ్చిమ - రేవూరి ప్రకాష్ రెడ్డి
 
5. మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి
 
6. మహబూబ్ నగర్- ఎర్ర శేఖర్
 
7. ఉప్పల్ - వీరందర్ గౌడ్
 
8. శేరి లింగంపల్లి - భవ్య ఆనంద ప్రసాద్
 
9. మలక్ పేట్ - ముజాఫర్
 
Journalists, who have the passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top