చంద్రబాబు ఎఫెక్ట్ ఢిల్లీలో గట్టిగా తగిలింది !

By Xappie Desk, November 13, 2018 17:17 IST

చంద్రబాబు ఎఫెక్ట్ ఢిల్లీలో గట్టిగా తగిలింది !

చంద్రబాబు మహాకూటమి కేంద్రాన్ని కలవరపెడుతోంది. బిజెపీయేతర పార్టీలను ఏకం చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాల లోని కొత్త పార్టీలను కూడా కూటమిలో కలిపేందుకు బాబు కసరత్తులు చేస్తున్నారు. బిజెపి పైన అసంతృప్తిగా ఉన్న పార్టీలను ఎందుకని కూటమిలో కలుపుకొని పోతున్నారు. బీహార్ కు చెందిన శరద్ యాదవ్ మహాకూటమిలో కీలక వ్యక్తి. బీహార్ లో ఇప్పుడు ఆయనదే హవా. చీలిక దిశగా బిహార్‌లో ఎన్డీయే కూటమి మలుపులు తిరుగుతోంది. అక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆర్‌ఎల్‌ఎస్పీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ... త్వరలోనే ఎన్డీఏకు గుడ్ బై చెప్పడానికి సిద్ధమయింది. రామ్ విలాస్ పాశ్వాన్ కూడా అదే దారిలో ఉన్నారు.
 
అలాగే సోమవారం శరద్ యాదవ్ తో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన ఆర్ ఎల్ ఎస్ పి అధినేత, ఉపేంద్ర కుష్వాహా సమావేశమయ్యారు. బిజెపి పాలన పట్ల ఎల్జేపీ మరియు ఆర్ ఎల్ ఎస్ పి పార్టీలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే ఎన్డీయే కూటమి లో భాగంగా బిజెపి మరియు జెడియు మధ్య కుదిరిన లోక్ సభ సీట్ల పంపిణీ లో వీరికి అన్యాయం జరుగుతోందట. ఈ పరిస్థితుల్లో వీరిద్దరి మధ్య భేటీ బీహార్ రాజకీయాల్లో చాలా ఉత్సుకతను రేపుతోంది. ఆర్ ఎల్ ఎస్ పీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జేడీయూ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కిషోర్ తో రహస్యంగా భేటీ అయ్యారు. దీంతో ఉపేంద్ర రాష్ట్రంలోని తాజా పరిస్థితులను శరద్ కు తెలియజేసేందుకు సిద్ధమయ్యారు.
 
ఇంకోవైపు లోక్ జనశక్తి నేత పాశ్వాన్ కూడా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. బీహార్ లో జరుగుతున్న విషయాలు అన్నిటి గురించి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అవుతామని ఉపేంద్ర తో పాటు రామ్ విలాస్ పాశ్వాన్ కూడా తెలిపారు. ఈ తాజా పరిణామాల ప్రకారం ఈ నెలలోనే బీహార్లో ఎన్డీయే కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ఆర్ ఎల్ ఎస్ పి మరియు ఎల్జేపీ పార్టీలు 2 లాలూ కుమారుడి పెట్టిన ఆర్జేడీ పార్టీ తో కలవనున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే చంద్రబాబుతో రామ్ విలాస్ పాశ్వాన్ కు మంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. రెండు దశాబ్దాల కిందట బాబు ఢిల్లీలో చక్రం తిప్పే సందర్భంలో పాశ్వాన్ కీలక పదవులు పొందారు. ఇప్పుడు మహాకూటమి బాగా బలంగా ఉన్నందున ఆయన మళ్లీ బాబుతో భేటీ కానున్నారట.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop