జగన్ హత్యాయత్నం కేసులో ఏపీ సీఎం చంద్రబాబు కి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

By Xappie Desk, November 14, 2018 09:34 IST

జగన్ హత్యాయత్నం కేసులో ఏపీ సీఎం చంద్రబాబు కి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

అక్టోబర్ 25 వ తారీఖున విశాఖపట్టణం విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తితో ముమ్మిడివరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యాయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో కొద్దిపాటి గాయాలతో బయటపడిన జగన్ రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుని ప్రస్తుతం తిరిగి మళ్ళీ ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ..జగన్ హత్యాయత్నం కేసు గురించి హైకోర్టు కి వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా జగన్ పై కుట్ర జరగడంలో ఏపీ ప్రభుత్వం హస్తం ఉందని వైసిపి పార్టీకి చెందిన పెద్దపెద్ద నాయకులు ఆరోపించారు.
 
ఈ క్రమంలో తాజాగా ఇటీవల హై కోర్టులో విచారణకు వచ్చిన జగన్ కేసు ..గురించి టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి మరియు ఏపీ డీజీపీ కి జగన్ కేసు గురించి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు కి ఎటువంటి సమాధానం ఇస్తారు అని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలలో అంతటా ఆసక్తి నెలకొంది. ఇక మ‌రోవైపు సినీ న‌టుడు శివాజీ తెర‌పైకి తెచ్చిన ఆప‌రేష‌న్ గ‌రుడ పై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయ‌ని వైసీపీ త‌రుపున న్యాయ‌వాది హైకోర్టులో ప్ర‌స్తావించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా జ‌గ‌న్ పై దాడి కుట్ర‌లో భాగంగానే జ‌రిగింద‌ని దీంతో స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌న జ‌రిపించాల‌ని కోర్టును కోరార‌ని స‌మాచారం.Top