అది మగతనం అంటే జగన్ పై సీరియస్ అయిన పవన్..!

అది మగతనం అంటే జగన్ పై సీరియస్ అయిన పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయాలు దారుణంగా దిగజారిపోయాయని కోడి కత్తులు పట్టుకొని ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లి పోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దారుణంగా అవినీతి జరుగుతోందని అధికార ప్రతిపక్ష పార్టీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని..రెల్లికులస్థుల భూములను వైసిపి నేత దోచుకున్నా పట్టించుకున్న నాథుడు లేడని తప్పు పట్టారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేని తానే ఇన్ని ప్రజా సమస్యలకు పరిష్కారం కనుక్కుంటున్నానని అంటూ వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ ఏం చేస్తుందని వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
 
సమాజంలో ప్రజా సమస్యలపై నేను ప్రశ్నిస్తుంటే నాపై వ్యక్తిగతమైన దాడికి వస్తున్నారని అలా కాకుండా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడితే మగతనం అవుతుందని పేర్కొన్నారు..అసెంబ్లీకి వెళ్లకుండా నా వ్యక్తిగత జీవితంపై దూషించే మాటలు ఏమిటని విమర్శించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అంతేకాకుండా కాకినాడ పోర్టులో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.Top