తూర్పు గోదావరి ప్రాంతంలో పాపకు పేరు పెట్టిన పవన్..!

తూర్పు గోదావరి ప్రాంతంలో పాపకు పేరు పెట్టిన పవన్..!

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలతో సమావేశం అయ్యే వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సామాన్యుడికి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు పవన్. యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ప్రాంతంలో రెల్లి కాలనీలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి పవన్ నామకరణం చేశారు. ఆ బాబుకు పవన్ శంకర్ అని పేరుపెట్టారు. రెల్లి సామాజికవర్గానికి జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అంతా మతాలను స్వీకరిస్తారు కానీ తాను మాత్రం రెల్లి కులాన్ని స్వీకరిస్తానన్నారు. రెల్లి సామాజికవర్గం ఎంతో ఉత్తమమైనదంటూ అభివర్ణించారు. సమాజంలో చెత్తను ఎలా ఏరివేస్తారో రాజకీయాల్లో చెత్తను జనసేన కూడా ఏరివేస్తుందన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం కోసమే పాలిటిక్స్ లో అడుగుపెట్టానని...ఈ జీవితం చివరి దాకా ప్రజా సమస్యలపై పోరాడతానని ప్రజలకు హామీ ఇచ్చారు పవన్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top