అందరికి షాక్ ఇస్తూ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటి..!

By Xappie Desk, November 14, 2018 10:30 IST

అందరికి షాక్ ఇస్తూ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటి..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో టిడిపి పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారిపోవటంతో చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు..ఈ నేపథ్యంలోనే అటు యాత్రలు చేస్తున్న జగన్...పవన్ పార్టీలలోకి చాలామంది జంప్అవుతున్నారు. ఇదే క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో చాలా మంది టిడిపి సీనియర్ నాయకులు ఇక మనకి భవిష్యత్తు ఉండదు అంటూ తమలో తాము చర్చించుకుంటున్నట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.
 
ఇటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీలోకి టాలీవుడ్ సీనియర్ నటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న వార్త అందరికీ షాక్ ఇచ్చినట్లయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సినీనటి మంజు భార్గవి కలిశారు. ఆమె త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించి మంజు భార్గవి ...ఏపీ సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మంజు భార్గవి అనగానే గుర్తొచ్చే సినిమా 'శంకరాభరణం'. ఆ చిత్రం ద్వారా ఆమె తెలుగులో నటిగా మంచి పేరు సంపాదించారు. అంతేకాకుండా శాస్త్రీయ నృత్యకళాకారిణి అయిన ఆమె...ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. దీంతో సీనియర్ నటి మంజు భార్గవి పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్న అన్న వార్త అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనమైంది.Top