రైల్వే జోన్ కి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసిన పురందేశ్వరి..!

రైల్వే జోన్ కి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసిన పురందేశ్వరి..!

విభజన నేపథ్యంలో ఆనాడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రధాన హామీల లో ఒక హామీ విశాఖపట్నానికి రైల్వే జోన్. వచ్చే 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ- బీజేపీ కూటమి ల మధ్య తీవ్ర విభేదాలు రావడంతో విభజన హామీలు తెలుగుదేశం మరియు విపక్ష పార్టీల మధ్య రాజకీయ సమస్యగా మారిపోయింది.
 
ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అనేకసార్లు ఏపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మరియు మంత్రులు అనేకసార్లు అసెంబ్లీలోనూ మరియు మీడియా ముందు బహిరంగంగానే కామెంట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా బిజెపి పార్టీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ రైల్వే జోన్ సంబంధించి సంచలన కామెంట్ చేశారు.
 
విజయవాడను రైల్వేజోన్‌గా ప్రకటించమని కోరితే క్షణాల్లో పని పూర్తి చేయటానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మాజీ బీజేపీ మహాళా మంత్రి పురందేశ్వరి ప్రకటించారు. ఒడిషా నుండి విడిపోయి విశాఖ రైల్వే జోన్‌గా ఏర్పడితే అతి చిన్న జోన్‌గా మిగిలిపోతుందని చేప్పారు. విజయవాడను రైల్వే జోన్‌గా కోరితే కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ విశాఖలోనే రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కోరుతు న్నామని పురందేశ్వరి వెల్లడించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top