వైఎస్ కుటుంబంపై ఊహించని కామెంట్లు చేసిన మంత్రి యనమల ..!

వైఎస్ కుటుంబంపై ఊహించని కామెంట్లు చేసిన మంత్రి యనమల ..!

ఏపీ ఆర్ధిక మంత్రి యనమల, దివంగత వైఎస్ కుటుంబంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ కుటుంబం మొత్తం క్రిమినల్స్ మరియు అవినీతిపరులు అంటూ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్ చేశారు. ముఖ్యంగా తన తండ్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని దారుణంగా అవినీతి మయం చేసి దోచుకున్నారని ప్రజాధనాన్ని లూటీ చేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇటువంటి వ్యక్తిని వైయస్ విజయమ్మ ప్రజలే కాపాడుకోవాలి అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కుటుంబాన్ని ఎందుకు కాపాడాలి?. రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారు. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెరగకుండా చేసింది జగనే. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ...జగన్‌ కానీ, పవన్ కల్యాణ్ గానీ ఒక్కమాట అనడం లేదు. ఈ ముగ్గురి కలయికకు ఇదే నిదర్శనం?' అని అన్నారు.
 
విభజనతో నష్టాలపాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అభివృద్ధికి అడుగులు వేస్తుంటే జగన్ తన అధికారం కోసం ప్రజాసమస్యలు అంటే ప్రజలని ప్రభుత్వంపై ఉసిగొలిపి పాదయాత్ర చేయడం ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత గా ఎన్నికవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు అని తగిన సమయమందు ప్రజలే బుద్ధి చెబుతారని..భవిష్యత్తు మొత్తం తెలుగుదేశం పార్టీదే అని అన్నారు మంత్రి యనమల.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top