జగన్ పై జరిగిన హత్యా యత్నం కేసు గురించి విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

By Xappie Desk, November 14, 2018 10:59 IST

జగన్ పై జరిగిన హత్యా యత్నం కేసు గురించి విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి కి కర్త కర్మ క్రియ మొత్తం ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబేనని పేర్కొన్నారు వైసిపి సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి. జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయానికి సంబంధించి జరుగుతున్న విచారణ గురించి మరియు కేసులో ఉన్న లోసుగులు గురించి ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వైసిపి పార్లమెంటు సభ్యులు వివరించారు. ముఖ్యంగా ఈ కేసులో థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని వైసిపి నాయకులు రాష్ట్రపతిని కోరారు.
 
ముఖ్యంగా కేసును నీరుగార్చడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరియు జగన్ పై జరిగిన దాడిని తప్పుదోవ పట్టించే విధంగా టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లను రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. జగన్ పై జరిగిన హత్య యత్నం కుట్రదారుల్లో చంద్రబాబుతోపాటు కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సినీనటుడు శివాజీ, రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ లు ఉన్నారని తెలిపారు.
 
నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి థర్డ్ పార్టీతో విచారణ జరిపితే మరింత మంది కుట్రదారులు వెలుగులోకి వస్తారన్నారు. జగన్ హత్య కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే ఆయనే నేరుగా రాష్ట్రపతిని కలిసేవారని దాడిపై వివరణ ఇచ్చేవారన్నారు. నిజంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు కి సంబంధం లేకపోతే విచారణ కు రెడీ అవ్వాలని సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Top