అసలు జగన్ కు మగతనం ఉందా... అంటున్న పవన్…!

By Xappie Desk, November 14, 2018 15:15 IST

అసలు జగన్ కు మగతనం ఉందా... అంటున్న పవన్…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సభలలో సినిమా డైలాగులు చెప్పడం తరచుగా చూస్తుంటాం. అయితే అతను అలా మిగతా పార్టీల మీద విరుచుకుపడడం వారి అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. పవన్ కల్యాణ్ ను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నాలుగు వేళ్లు చూపించి.. కార్లను మార్చినట్లు.. పెళ్లాలను మారుస్తాడని… విమర్శించినప్పుడు… పవన్ కల్యాణ్… సైలెంట్ గా ఉన్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు పవన్ ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు.
 
అవతలి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం మగతనం కాదని అసలు అదే ఉంటే వెళ్లి అసెంబ్లీలో సమస్యలను పరిష్కరించమని చెలరేగిపోయాడు. బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటామన్న వైసీపీ.. రెల్లికులస్థుల భూములను ఆ పార్టీ నేత దోచుకున్నా పట్టించుకున్న నాథుడు లేడన్నారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీలేని తానే ఇన్ని ప్రజా సమస్యలకు పరిష్కారం కనుక్కుంటున్నానని.. వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్. ప్రతిపక్షంలో ఉండి ప్రజా ప్రజా సమస్యలను అసెంబ్లీలో వివరించాల్సిన ఈయన అది మానేసి బుగ్గలు నిమురుతున్నారు అని చమత్కరించారు.
 
అయితే జగన్ మోహన్ రెడ్డి… పవన్ ను విమర్శించి చాలా రోజులు అవుతుంటే ఇప్పుడు పవన్ దానికి కౌంటర్ ఇవ్వడం ఏంటి అన్నది ఇక్కడి ప్రశ్న. ఈ మధ్యనే ఎంపీలకు పౌరుషం లేదా అని విమర్శించేందుకు, ఒంటికి కారం పోసుకొని అసెంబ్లీ కి వెళ్ళమని ఎద్దేవా చేశారు. అచ్చం ఇలాగే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ పై మండిపడడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపింది. ఇటీవలి కాలంలో.. చాలా జగన్ – పవన్ మధ్య పొత్తుల చర్చలు జరిగాయన్న ప్రచారం ఉంది. అవి విఫలమవడతో… జగన్ తాను కోరుకున్నన్నిసీట్లు ఇవ్వకపోవంతోనే… పవన్ ఇలా రివర్స్ అవుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. చూద్దాం మున్ముందు ఈ పవర్ లీడర్స్ మధ్య వార్ ఎలా ఉండబోతుందో.Top