సంచలనం రేపుతున్న ఆపరేషన్ గరుడ శివాజీ రాసిన లేఖ..!

సంచలనం రేపుతున్న ఆపరేషన్ గరుడ శివాజీ రాసిన లేఖ..!

ఏ పి ప్రతి పక్షనేత వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరుగుతుంది అని ఆపరేషన్ గరుడ లో వివరించిన సినీనటుడు హీరో శివాజీ తాజాగా రాసిన లేఖ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తుంది. జగన్ పై దాడి జరగక ముందు అమెరికాకు వెళ్ళిన హీరో శివాజీ అడపాదడపా సోషల్ మీడియా ముందుకు వచ్చి జగన్ పై జరిగిన హత్య యత్నం గురించి మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో జగన్ పై హత్యాయత్నం విషయంలో హీరో శివాజీ పాత్ర కూడా ఉన్నట్లు అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపించడంతో వెంటనే సోషల్ మీడియా కు వచ్చి హీరో శివాజీ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు. ఇదే క్రమంలో లక్ష్మీపార్వతి కూడా సినీ నటుడు శివాజీ పై షాకింగ్ కామెంట్లు చేశారు. వైయస్ జగన్ పై హత్యాయత్నం చేసిన వారు సినీనటుడు శివాజీని చంపేస్తారు అతడిని కాపాడుకోవాలంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. శివాజీని చంపి ఆ నేరాన్ని వైఎస్ జగన్ పై పెట్టినా పెడతారంటూ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చావుకు భయపడే పిరికివాడినికాదని...తనకు చావంటే భయం లేదని స్పష్టం చేశారు. నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు దేనికైనా సిద్ధమన్నారు. ఏపీని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పడతానని హెచ్చరించారు. లక్ష్మీపార్వతి తనపై జాలీ చూపాల్సిన అవసరంలేదని...ఆమెను చూస్తే జాలేస్తోందన్నారు. వైసీపీ తరపున ఎన్ని వాదనలు చేసినా లక్ష్మీపార్వతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని శివాజీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో త్వరలో ఇండియాకు రాబోతున్న తనకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీజీపీ లో రక్షణ కల్పించాలని లేఖ రాశారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top