తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఫస్ట్ టైం నోరు విప్పుతున్న జగన్..!

By Xappie Desk, November 15, 2018 09:47 IST

తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఫస్ట్ టైం నోరు విప్పుతున్న జగన్..!

వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత జగన్ విశాఖపట్టణంలో విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు కనీసం మీడియా ముందుకు వచ్చి కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ క్రమంలో తనకు గాయం అయిన తర్వాత రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకున్న జగన్ ఇటీవల ఇంకా పూర్తి చేయాల్సిన ప్రజా సంకల్ప పాదయాత్ర కు పూనుకొని ఇప్పటికే కొన్ని రోజులపాటు పాదయాత్ర చేసుకుంటూ సాగిపోతున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో చేస్తున్న జగన్ పాదయాత్రకి గాయం అయిన తర్వాత ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురం బహిరంగసభలో జగన్ ప్రసంగం చేయబోతున్నాడు.
 
దీంతో హత్యాయత్నం జరిగిన తరువాత మొట్టమొదటి సారి జగన్ ప్రసంగానికి రెడీ అయిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు జగన్ ఎటువంటి ప్రసంగం చేస్తారో తనపై జరిగిన హత్యాయత్నం గురించి ఏం విషయాలు బయటకు చెప్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జగన్ హత్యాయత్నం విషయంలో హైకోర్టు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కి నోటీసులు ఇవ్వడం తో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ఇటువంటి కామెంట్లు చేస్తారో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop