సొంత జిల్లా నేతలే చంద్రబాబు కి షాక్ ఇచ్చారు..!

సొంత జిల్లా నేతలే చంద్రబాబు కి షాక్ ఇచ్చారు..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి సొంత జిల్లాలోనే షాక్ తగిలింది. ఇప్పటికే ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కి కోట మీద ఉన్న టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూడుగా చీలి పోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరడంతో పాటు సొంత పార్టీ నేతలే చంద్రబాబుపై తిరగబడుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో గడిచిన 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ నేత తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చి పార్టీ నుండి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా తాంబల్లపల్లి నియోజకవర్గం పేటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్‌ తమ అనుచరులతో కలిసి తాజాగా వైసీపీలో చేరారు.
 
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న జగన్ ని కొండా గీతమ్మ, సిద్దార్థ్ లు కలిశారు. మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్‌ పాటించిన విలువలు ప్రస్తుతం టీడీపీలో లేవని అన్నారు. అందుకే 40 ఏళ్లు టీడీపీలో ఉన్నప్పటికీ.. విలువల కోసమే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. టీడీపీ నిజమైన నేతలకు, కార్యకర్తలకు ప్రస్తుతం విలువ లేదని తెలిపారు... రాబోయేది జగన్ రాజ్యం అని ఆ రాజ్యంలో ప్రతి పేదవాడు నిర్భయంగా బ్రతుకుతాడని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని సామాన్యుల జీవితాల పై ఉన్న బ్రతుకు భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top