పవన్ పై ఉన్న కోపాన్ని బండ్ల గణేష్ పై తీర్చుకున్న చంద్రబాబు..?

పవన్ పై ఉన్న కోపాన్ని బండ్ల గణేష్ పై తీర్చుకున్న చంద్రబాబు..?

టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన బండ్ల గణేష్ కి ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో షాకిచ్చారు. ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం మనకందరికీ తెలిసినదే. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో షాద్ నగర్ నుండి కానీ రాజేంద్ర నగర్ నుండి అయినా పోటీ చేద్దామని ఆలోచన లో ఉన్న బండ్ల గణేష్ కి తాజాగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల విషయంలో విడుదల చేసిన రెండు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు బండ్ల గణేష్. విజయ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మహాకూటమిగా ఏర్పడి చాలా రాజకీయ పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే మనకందరికీ తెలిసినదే..ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న మహాకూటమికి దిశానిర్దేశం చేస్తున్నారు టిడిపి జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడి గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ కి తనదైన శైలిలో రాజకీయం చేసి టికెట్ రాకుండా చేసింది చంద్రబాబేనని అంటున్నారు చాలామంది తెలంగాణ రాజకీయ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అడుగడుగునా అడ్డం పడుతున్న పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపాన్ని చంద్రబాబు ఈ విధంగా పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గణేష్ పై తీర్చుకున్నారు అని చాలామంది తెలంగాణ పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top