ప్రజాపోరాట యాత్ర తూర్పుగోదావరిలో చంద్రబాబు మరియు జగన్ లపై షాకింగ్ కామెంట్లు చేసిన పవన్..!

ప్రజాపోరాట యాత్ర తూర్పుగోదావరిలో చంద్రబాబు మరియు జగన్ లపై షాకింగ్ కామెంట్లు చేసిన పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న ప్రజా పోరాట యాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా లో చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మరియు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అనంతపురం లో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ అధినేత చంద్రబాబు చేతులు కలపటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తాను తన అన్నయ్య చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతు పలికానని అయితే చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. అనుభవజ్ఞుడని ప్రజలు అధికారం ఇస్తే ఇలా చేస్తారా అంటూ నిలదీశారు.
 
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని తీవ్ర అవినీతి మయం చేసిందని రానున్న ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని పేర్కొన్నారు. ఈక్రమంలో అధికారపార్టీ టిడిపిని నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ అధికారం కోసం పాదయాత్రలు చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. జగన్ ని ప్రశ్నిస్తే తన ఇంటి ఆడపడుచులను తిడతారని వాళ్ల ఇంటి ఆడపడుచులను తాము తిట్టలేమా అని ప్రశ్నించారు. ఇంతటి దారుణమైన వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రజా సమస్యలు ఎలా తీరుతాయని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎన్నికలు దగ్గరకొస్తున్న కలది పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో చంద్రబాబు మరియు జగన్ ల పై విమర్శల వర్షం రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top