కులమతాల సమానత్వం కోసమే పవన్ తపన - కులమత రాజకీయం కోసం కాదు

By Xappie Desk, November 15, 2018 12:56 IST

కులమతాల సమానత్వం కోసమే పవన్ తపన - కులమత రాజకీయం కోసం కాదు

చేతిలో రెండు వెబ్ సైట్ లూ కాసిన్ని సోషల్ మీడియా పేజీలూ ఉంటె ఏది పడితే అది రాసుకోవడానికి జర్నలిజం ని తాకట్టు పెట్టె బ్యాచ్ ఒకటి సిద్ధం అవుతోంది ఈ మధ్య కాలం లో. జనసేన ని మాత్రమే టార్గెట్ గా చేసుకుని పవన్ ఏది చేసినా తప్పు అని అరుస్తూ గావుకేకలు పెట్టె ఒక పర్టిక్యులర్ వెబ్ సైట్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మ్యానిఫెస్టో గురించి వాగిన వాగుళ్ళ కి సోషల్ మీడియా లో జనాలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.
 
"జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో ప్రధమం :
"కులాలను కలిపే ఆలోచనా విధానం"
 
12 హామీల్లో 6 కులం కులం కులం
- బీసీలకు 5శాతం రిజర్వేషన్ల పెంపు
- చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
- కాపులకు రిజర్వేషన్ - ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం
- ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి corp ,hostels"
 
జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో ఒకటి :
"మతాల ప్రస్తావన లేని రాజకీయం "
 
12 హామీల్లో ఒకటి :
" ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు "
 
అంటూ ఒక వెబ్ సైట్ ట్విట్టర్ లో తన పోస్ట్ లు పెట్టింది. అధికార పార్టీకి కొమ్ము కాసే వెబ్ సైట్ గా సదరు మీడియా మీద ఎప్పటి నుంచి అలిగేషన్ లు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద పడి గొడవ చెయ్యడం తప్ప లాజికల్ గా వాదించడం అనేది అలవాటు కూడా లేని రాతలు వారికి కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ ని సినిమాల పరంగా - పొలిటికల్ పరంగా విమర్శించడం మాత్రమె ఆయుధంగా చేసుకున్నారు వాళ్ళు. విషం కక్కడం ప్రధాన అస్త్రం గా చేసుకుని సోషల్ మీడియా ని ఇలా కూడా అపహాస్యం చెయ్యచ్చా అనే ప్రయత్నాల్లో వారే అపహాస్యం అయ్యారు. ఇవాళ వారు రాసిన "కులాలను కలిపే ఆలోచనా విధానం" vs 12 హామీల్లో 6 కులం కులం కులం పోస్టు జర్నలిస్టు లకి సైతం అవగాహన లేమి లేకపోవడాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కులాలని కలపడం అంటే కులాల గురించి మాట్లాడకుండా ఉండడం కాదు అనీ సమానత్వం తీసుకుని రావడం అనీ అందుకోసం రిజర్వేషన్ లు తప్పనిసరి అని వారికి తెలీదు కాబోలు. ఆర్ధికంగా , సామాజికపరంగా , అభివృద్ధి పరంగా వెనకపడిన కులాలని ఒక్కతాటి పైన నిలిపి అగ్ర వర్గాలుగా రాజ్యం ఏలుతున్న వారితో సమానం చెయ్యడమే పవన్ చెప్పిన కులాలని కలిపే ఆలోచనా విధానం అంతే కానీ కుల చిచ్చులు పెట్టి రైళ్ళు తగల బెట్టించడం కాదు .. "మతాల ప్రస్తావన లేని రాజకీయం " అంటే మైనారిటీ లకి తోడుగా నిలబడతాం అని .. సచార్ కమిటీ ముస్లింల అభివృద్ధి కోసం విద్య ఉద్యోగం మొ విషయాల్లో సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో వెనకబడిన వారిని ప్రత్యేకంగానే చూడాలని రాజ్యాంగం చెపుతుంది (Art 14 n 15) .. రాజకీయ పదవులు - అధికారాలూ లేకుండా రాజకీయం చేస్తాం అని పవన్ అర్ధం కానీ వెనకబడిన వర్గాలని గాలికి వదిలేస్తాం అని కాదు .. కులగజ్జి తో ప్యాకేజీ జర్నలిజం తో కక్క్రుత్తి పడే మీడియా హౌస్ లు తెలుసుకుంటే మంచిది అంటున్నారు జనాలు కూడా. కేవలం జనసేన - పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమె కాకుండా సామాన్య ట్విట్టర్ యూజర్ లు కూడా ఈ పోస్ట్ కింద ఆ వెబ్సైటు నిర్వాహకుల మీద అగ్గిమీద గుగ్గిలం అవడం విశేషం
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop