జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణా లో ప్రచారానికి గ్రీన్ సిగ్నల్

జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణా లో ప్రచారానికి గ్రీన్ సిగ్నల్

నందమూరి కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. హరి కృష్ణ కుటుంబానికి బాలకృష్ణ కు మధ్య ఏదో గ్యాప్ ఏర్పడిందని అందరూ అనుకున్నారు. రోడ్ ప్రమాదంలో హరికృష్ణ హఠాన్మరణం తర్వాత నందమూరి ఫ్యామిలీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ నందమూరి, నారా ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. తరచూ కలుస్తున్న కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయి. దీంతో ఇక 2019 ఎలక్షన్స్ లో ఎన్.టి.ఆర్ ను పార్టీ ప్రచారానికి సహకరించాలని కోరగా తానూ ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే ఎన్.టి.ఆర్ ను తెలంగాణా వరకు ప్రచారానికి ఓకే చెప్పారని టాక్ .అది కూడా తెలంగాణాలో మహాకూటమిలో భాగంగా టిడిపి తరపున కూకట్ పల్లి నియోజక వర్గం నుండి హరికృష్ణ కుమార్తె సుహాసినిని రంగంలో దించుతున్న నేపధ్యంలో ప్రచారం చెయ్యనున్నారని సమాచారం. దాదాపు ఆమె అంగీకరించినట్టే అని టాక్ నడుస్తుంది. అయితే అక్క తరపున ప్రచారం చేసేందుకు తమ్ముడు జూనియర్ ను వాడుకోనున్నారట టీడీపీ శ్రేణులు. ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ రంగంలోకి దిగితే కె.సి.ఆర్ గులాబి పార్టీకి మామూలు షాక్ కాదు. కచ్చితంగా ఎదురుదెబ్బ తగిలినట్టే. టిడిపి తరపున ఎన్.టి.ఆర్ ప్రచారం చేశాడు అంటే అది కచ్చితంగా మహాకూటమికి ప్లస్ అయినట్టే లెక్క. మరి ఎన్టీఆర్ ప్రచార పర్వం లోకి దిగితే గానీ అసలు ఎన్నికల నాటకం రక్తి కట్టదు. కేసీఆర్ కు అప్పుడు నిజంగా నిద్ర పట్టదు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు .
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top