మహాకూటమి గ్రాఫ్ విపరీతంగా పెరిగింది !

By Xappie Desk, November 15, 2018 17:13 IST

మహాకూటమి గ్రాఫ్ విపరీతంగా పెరిగింది !

మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌, టీడీపీ ఉప్పు, నిప్పుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలూ కలిసి ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నాయి. మొదటిసారి రాహుల్ ను..చంద్రబాబు కలిశారు. ఇప్పుడు .. తెలంగాణ ప్రచారంలో రోడ్ షో చేయడానికి సిద్ధమవుతున్నారు. సుదీర్ఘ వైరం, పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న ఆ రెండు పార్టీల కార్యకర్తలు కలవరని, క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ జరగదన్న ఆశల్లో కేసీఆర్ ఉన్నారు. కానీ... ఓట్ల బదిలీ జరిగి తీరుతుందని.. కూటమి పెద్దలు నిరూపించాలనుకుంటున్నారు. తమ మధ్య అరమరికలు లేవని చాటడమే కాకుండా, శ్రేణుల ఏకీకరణకు ఇద్దరు నేతలతో కలిసి రోడ్‌ షో నిర్వహించాలనుకుటున్నారు. కూటమి అధికారంలోకి వస్తుందన్న సానుకూల భావన కలిగించి, ఓట్లు చీలిపోకుండా చూస్తుందని అంచనా వేస్తున్నారు. మైనారిటీలు కాంగ్రె్‌సకు ఓటు బ్యాంకుగా ఉంటే.. గతంలో టీడీపీకి మద్దతుగా నిలిచారు. మోదీ- కేసీఆర్‌పై విమర్శల ద్వారా మైనారిటీలను తమ వైపునకు తిప్పుకోవడమే ధ్యేయంగా బాబు- రాహుల్‌ రోడ్‌షో ఉండనుంది.బహుముఖ వ్యూహంతోనే జమిలి రోడ్‌ షోకు పూనుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి బీసీలు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చారు. వారిని కూడా ఆకట్టుకునేందుకు ఈ రోడ్ షో ఉపయోగపడనుంది. ఇటీవల పీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను స్వయంగా కలిసి వచ్చిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కూటమి పేరిట ఇతర పార్టీల నేతలనూ కలిశారు. కీలకమైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆధ్వర్యంలో ఈనెల 22న ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల శిఖరాగ్ర సమావేశం జరపనున్నారు. ఈ భేటీ ప్రభావం ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుంది.శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, మేడ్చల్‌, పటాన్‌చెరు, గోషామహల్‌, మలక్‌పేట అసెంబ్లీ నియోజక వర్గాల్లోనే కాకుండా, శివారు సెగ్మెంట్లలోనూ రాహుల్‌-చంద్రబాబు జోడీ పర్యటించే అవకాశం ఉంది. ఈనెల 22-30మధ్య ఉమ్మడి రోడ్‌ షోలు ఉంటాయని తెలుస్తోంది. వరుసగా రెండు, మూడు రోజులపాటు వీటిని కొనసాగించేలా కసరత్తు జరుగుతోంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop