జగన్ మోహన్ ' రెడ్డి ' కాదు ??

జగన్ మోహన్ ' రెడ్డి ' కాదు ??

రెండు రోజులు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై విరుచుకుప‌డుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా మ‌రింత సంచ‌ల‌న‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏ విధంగా రెడ్డి అయ్యారంటూ పెద్ద అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. అవినీతి అక్ర‌మాల్లో నిండా మునిగి జైలుకెళ్లి వ‌చ్చిన జ‌గ‌న్‌కు ముఖ్య‌మంత్రి కావ‌డానికి అస‌లు అర్హ‌త ఉందా అని నిల‌దీశారు. ''జగన్‌ మా ఇంటి ఆడపడుచులను తిట్టొచ్చా!? నేను ఆయనలా సంస్కార హీనంగా మాట్లాడను. నాకేం భయాలు లేవు. హైదరాబాద్‌లో భీంరావ్‌బాడలోని పేదల ఇళ్లు తొలగించినప్పుడు జగన్‌ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగానే ఎదిరించాను. జగన్‌ మోహన్‌రెడ్డి ఏమైనా సురవరం ప్రతాప రెడ్డా, తరిమెల నాగిరెడ్డా, రావి నారాయణరెడ్డా, పుచ్చలపల్లి సుందరరామి రెడ్డా, పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డా. వాళ్లంతా జైలుకెళ్లారు. జగన్‌ కూడా జైలు కెళ్లారు. అంతామాత్రాన వారికీ, జగన్‌కూ పోలిక లేదు'' అని పవన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.క‌మ్యూనిస్టు దిగ్గ‌జం పుచ్చలపల్లి సుందరయ్య తన పేరు వెనుక కులం ఉండకూడదని 'రెడ్డి'ని తొలగించుకున్నారని... ఆయన స్ఫూర్తితో తమ కుటుంబంలోనూ ఎవరి పేరులోనూ కులం ఉండదని చెప్పుకున్న ప‌వ‌న్‌... జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి ఉంద‌న్న‌ట్లు ప‌రోక్షంగా వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. కొడి క‌త్తి గుచ్చుకుంద‌ని హైద‌ర‌బాద్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్న జ‌గ‌న్‌కు తిత్లీ దెబ్బ‌కు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైనా ఎందుకు క‌నిపించ‌లేద‌ని ప‌వ‌న్ నిల‌దీశారు. వేలకోట్ల అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన జగన్ కావాలో.. తాను కావాలో జ‌న‌మే నిర్ణ‌యించుకోవాల‌ని సూచించారు. 2019లో జగన్‌, పవన్‌, చంద్రబాబుల్లో ఎవరు నీతివంతమైన పాలన అందిస్తారో ఆలోచించుకోవాలన్నారు. ఒకప్పుడు స్కూటర్‌పై తిరిగిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రూ.100 కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలుసునన్నారు. యువతకి రోల్‌మోడల్స్‌.. గాంధీ, అంబేద్కర్‌, పొట్టిశ్రీరాములనీ... జగన్ మాత్రం కాద‌ని అన్నారు.ఇక‌, ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌తో వైసీపీ శ్రేణులు కూడా ఉలిక్కి ప‌డ్డాయి. కొన్ని రోజుల‌గా త‌మ అధినేత‌ను ప‌వ‌న్ టార్గెట్ చేయ‌డం వెనుక కార‌ణాలు తెలియ‌క వైసీపీ కేడ‌ర్ క‌ల‌వ‌రానికి గుర‌వుతోంది. అస‌లే ఒక‌వైపు కోడిక‌త్తి డ్రామా ర‌క్తిక‌ట్ట‌క ఉన్న ప‌రువు మొత్తం పోయి... శ్రీ‌కాకుళంలోనే పాద‌యాత్ర చేస్తూ ఆ జిల్లాల‌ను తుఫాను అత‌లాకుత‌లం చేస్తే క‌నీసం ప‌రామ‌ర్శించ‌కుండా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్న జ‌గ‌న్ తీరుతోనే త‌లెత్తుకోలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటుంటే ఇప్పుడు ప‌వ‌న్ కూడా త‌మ వెంట ప‌డ‌డాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ప‌వ‌న్ ఈ తీవ్ర‌మైన దాడి వెనుక కార‌ణాలు ఏమిటీ? ఎవ‌రి దిశానిర్దేశం మేర‌కు ప‌వ‌న్ రెచ్చిపోతున్నారో విశ్లేషించుకునే ప‌నిలో వైసీపీ కేడ‌ర్ త‌ల‌మున‌క‌లైంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop