జస్ట్ మిస్ ప్రమాదం నుండి తప్పించుకున్న పవన్ కళ్యాణ్..!

జస్ట్ మిస్ ప్రమాదం నుండి తప్పించుకున్న పవన్ కళ్యాణ్..!

జనసేన పార్టీ తరపున ప్రజాపోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రాంతం నుండి తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం బహిరంగసభలో పాల్గొనవలసిన నేపద్యంలో బయలుదేరుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని ఓ భారీ లారీ డీ కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ఒక కారులో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది బయలుదేరుతున్న వాహనాన్ని లారీ చాలా బలంగా ఢీకొట్టింది.
 
దీంతో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు..వారందరిని దగ్గర్లోనే ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు జనసేన పార్టీ నాయకులు..ఈ ప్రమాదంలో ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. అందరికీ చిన్నచిన్న గాయలే అయ్యాయని....ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ తో పాటు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో కి రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కి ప్రమాదం జరిగిందని తెగ కంగారు పడిపోయారు..అయితే చివరాకరికి వాస్తవ విషయం బయటకు వచ్చాక.... పవన్ కళ్యాణ్ కి ప్రమాదం జరగలేదని ఆయన భద్రతా సిబ్బందికి జరిగిందని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top