తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన కమెడియన్ వేణుమాధవ్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన కమెడియన్ వేణుమాధవ్..!

టాలీవుడ్ టాప్ కమెడియన్ లలో ఒకరు అయినా వేణుమాధవ్ త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరగబోతున్న రెండు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన వేణుమాధవ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలులో జరిగిన ఉప ఎన్నికలలో వై సిటీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతం కోదాడ నియోజకవర్గానికి చెందిన వేణుమాధవ్ తెలంగాణ లో జరగబోయే రెండో అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారిని కలుసుకొని నామినేషన్ పత్రాలు అందజేశారు.
 
చిన్నప్పటి నుండి తాను పుట్టిన ఊరికి రుణం తీర్చుకోవాలనే ఆశ ఉందని అయితే రాజకీయంగా అడుగులు వేస్తే ప్రతి సామాన్యుడికి కచ్చితంగా న్యాయం చేయగలుగుత కాబట్టి రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు వేణుమాధవ్. ప్రస్తుతం సినిమాలకు చాలా దూరంగా ఉన్న వేణుమాధవ్ గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకం గా ఉండే వాళ్ళు..తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ ఏ మహాసభ జరిగిన ఆ ప్రాంతంలో వేణుమాధవ్ మిమిక్రీలు చేసేవాడు. ఆలా పార్టీ మీటింగ్ లలో పాల్గొన్న వేణుమాధవ్ తన మిమిక్రి ద్వారా ప్రచార కార్యక్రమాలని నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న వేణుమాధవ్ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో వేణుమాధవ్ ని కోదాడ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారో లేదో చూడాలి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top