తన ఇంటి పేరు గురించి సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!

By Xappie Desk, November 16, 2018 10:45 IST

తన ఇంటి పేరు గురించి సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులను మరియు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను వారు చేస్తున్న రాజకీయాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ వాటివల్ల వచ్చే పర్యవసనాలను చక్కగా వివరిస్తున్నారు తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్. ఇదే క్రమంలో తాను రాజకీయాల్లోకి కులాలకు మతాలకు అతీతంగా సామాన్య ప్రజలకు దగ్గరగా వారి బాధలను అర్థం చేసుకునే రీతిలో తన భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయని తూర్పుగోదావరి జిల్లా రాజనగరం బహిరంగ సభలో ప్రజలకు హామీ ఇచ్చారు పవన్.
 
అంతేకాకుండా తాను రాజకీయాల్లోకి 2003లోనే వద్దామని అనుకున్న తన తల్లి మాట ప్రకారం మనకి రాజకీయాలు వద్దు అని అనటంతో ఆ సమయంలో ఆలోచన విరమించుకున్నానని పేర్కొన్నారు. అయితే రాను రాను సమాజంలో వ్యవస్థలు అవినీతి పెచ్చుమీరి పోయి సామాన్య ప్రజలు కష్టాలు పాలవడం చూసిన నేపద్యంలో తప్పని పరిస్థితుల్లో దేశంపై ప్రేమతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాను అని కుటుంబాన్ని వదిలి కొన్ని సుఖాలను వదిలి ఎంత కష్టమైనా మీ మధ్య కు వచ్చాను అంటే కారణం నా కుటుంబాన్ని కాదు మీరే నా కుటుంబం అని భావించాను కాబట్టి రాజకీయాల్లో అడుగు పెట్టానని స్పష్టం చేశారు పవన్.
 
అంతే కాకుండా అక్కడ అభిమానులు తెచ్చిన కొణిదెల కుటుంబం అనే ఫ్లెక్సీ ని చూసి తన ఇంటి పేరు కొణిదెల కాదని నా ఇంటి పేరు తెలుగు అని, తాను తెలుగు జాతికి చెందిన వాడినని అంతే కానీ ఒక కులానికి మాత్రమే చెందిన వాడిని కాదని అలాగే ఒక ఇంటికి మాత్రమే చెందిన వాడిని కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన కార్యకర్తలు మరియు ప్రజలు తరతరాల ధ్వనులతో సభను హోరెత్తించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Top