టీ కాంగ్రెస్ లో బాబు పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నా ఆ సామాజిక వర్గం వారు..?

టీ కాంగ్రెస్ లో బాబు పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నా ఆ సామాజిక వర్గం వారు..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ముందునుండి అండగా ఉన్న సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం. అయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఇతర పార్టీల సాయం మరియు ఐకమత్యం ఉంటేనే తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కి వ్యతిరేకంగా ఉండే ప్రతి రాజకీయ నాయకుడిని మరియు రాజకీయ పార్టీలు ఏకం చేసి మహాకూటమి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో సరైన స్పష్టత కొంత కురవడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
 
మరోపక్క మహాకూటమి పోటీచేసే స్థానాలలో అభ్యర్థుల విషయంలో చంద్రబాబు తన వర్గానికి సంబంధించిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ముందునుండి చంద్రబాబును విమర్శించే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నాను తెలంగాణ రాజకీయాల్లో టాక్. ఈ నేపథ్యంలో ఈ విషయం మొత్తం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీకి తెలియడంతో వెంటనే బుజ్జగింపు చర్యలకు దిగుతున్నారట. అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సరైన స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop