పవన్ పై వైసీపీ ఎదురుదాడి…సరైన కౌంటర్లు వేసిన బొత్స !

పవన్ పై వైసీపీ ఎదురుదాడి…సరైన కౌంటర్లు వేసిన బొత్స !

పవన్ కు ఉన్నపళంగా ఏమైందో ఏమోగానీ ఈమధ్య జగన్ పైన ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నాడు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అని కొంతమంది అంటుంటే మరికొంతమంది బాబు లాలూచీ అని అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా జగన్ ను ఒక రౌండ్ ఏసుకున్నారు. జగన్ కు కుర్చీ కాంక్ష అంటూ రెచ్చిపోతున్నారు, బుగ్గలు నిమురుతూ పాదయాత్రలు చేస్తున్నారంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. అయితే ఎట్టకేలకు వైసీపీ అతనిపై ఎదురుదాడికి దిగింది.
 
ఈమధ్య ఓ మీటింగ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారినే తాను ఎదిరించానని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని బొత్స తప్పుబట్టారు. ప్రజారాజ్యం పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇలా తాను వైఎస్ హయాంలో తాను ప్రశ్నించడం మొదలుపెట్టాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పాడు. కనీసం అతనితో ఉన్న నాదెండ్ల మనోహర్ అయినా అతన్ని వారించాల్సిందని చెప్పుకొచ్చారు. పవన్ ఎప్పుడు ఎవరితో ఎలా ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదని చమత్కరించారు. కులాల గురించి సంబంధం లేదంటూనే కులాల గురించి మాట్లాడే పవన్ ని జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పవన్ సామాజిక వర్గానికి ఉన్న ఓటుబ్యాంక్ చూసే 2014లో చంద్రబాబు ఆయన్ను దగ్గరకు తీశారని చెప్పారు. ఏదో తనకు కులం అంటూ లేదని చెప్పుకునే అతను మాత్రం ఎప్పుడో కులగజ్జి ఉన్నవాడిలా ప్రతీ సారి కులం పేరు తీసుకొస్తారు అని అన్నాడు.
 
జగన్ కు కుర్చీ అంటే పిచ్చి ఉందన్న పవన్, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో విశ్లేషించుకోవాలి అని సలహా ఇచ్చారు. పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పి, వారి కొటేషన్లు వాడుతూ పవన్ డాంబికాలు పలుకుతుంటారని, పవన్ కి అంత సీన్ లేదని తీసిపారేశారు. ఒకసారి తనకు సీఎం పదవి అంటే మక్కువ లేదంటూనే ఇంకొసారి మాత్రం తాను అధికారంలోకి వస్తే న్యాయం చేస్తా అంటాడు. ఇలా మాటలు మార్చే రాజకీయ పార్టీ బదులు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకోవాలని ఆయన సూచించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top