బీటలు వారిన మహా కూటమి ?

బీటలు వారిన మహా కూటమి ?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న పది సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీల మధ్య సరైన స్పష్టత రాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు మహాకూటమికి బీటలు పడుతున్నాయి అని అంటున్నారు తెలంగాణ రాజకీయ సీనియర్ నేతలు. ముఖ్యంగా వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం టికెట్ కు రెండు పార్టీలు అయినా కాంగ్రెస్ మరియు టీజేఎస్ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం టికెట్ విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య మరియు తెలంగాణ జన సమితి నాయకుడు పార్టీ వ్యవస్థాపకుడు కోదండరాం పోటీపడటంతో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారినట్టు తెలంగాణ రాజకీయాల్లో టాక్.
 
గత కొన్ని రోజుల నుండి జనగామ టిక్కెట్టుపై కాంగ్రెస్ పార్టీపై మల్లాగుల్లాలు పడ్డారు. మహాకూటమిలో అన్నీ పార్టీలు త్యాగాలకు సిద్దం కావాలంటూ ప్రకటనలు చేసిన అవి కాంగ్రెస్ కు మినహా మిగత పార్టీలకే వర్తిస్తున్నాయని కూటమిలో ఇతర పక్షాలు విమర్శిస్తున్నాయి. జనగామ టిక్కెట్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై తెలంగాణ జన సమితి నాయకుడు కోదండ రామ్ అసహనం వ్యక్తం చేసారని సమాచారం. ఈ నియోజకవర్గంలో ఏర్పాడిన ప్రతిష్టంబనే రానున్న ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపుతుందని కోదండ రామ్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. ప్రచారం - ఉమ్మడి మేనిఫెస్టో - కలసి పనిచేయడం వంటివి జరిగే పరిస్దితి లేదని - ఇది మహాకూటమి విజయాన్ని దెబ్బ తీస్తుందని తెలంగాన జన సమితి నాయకులు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. ఇదే క్రమంలో మహా కూటమి ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒకలాగా వ్యవహరించి టికెట్ల విషయానికొచ్చేసరికి కేవలం తమ పార్టీ అభ్యర్థులకు మొదటి స్థానం నుంచి మిగతా పార్టీలకు సంబంధించిన వారిని నిర్లక్ష్య పరిస్థితుల నేపథ్యంలో మహా కూటమిలో ఉన్న వివిధ పార్టీల రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయంపై అసహనం చెందుతున్నారు. పరిస్థితి ఇలానే మారిపోతే ఎన్నికలు జరగక ముందే మహాకూటమి విడి పోయే అవకాశాలు ఉన్నాయి అని పేర్కొంటున్నారు రాజకీయ పరిశీలకులు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top