ఆన్ లైన్ లో పెళ్లి చేసేసుకున్నారు ఇద్దరూ !

By Xappie Desk, November 17, 2018 12:55 IST

ఆన్ లైన్ లో పెళ్లి చేసేసుకున్నారు ఇద్దరూ !

ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయి ఇంటర్నెట్ సేవలు అందరికీ అందుబాటులోకి రావడంతో ఆన్ లైన్ లో అనేక గోరాలు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీ వల్ల చాలా వరకు కుటుంబాలు కోల్పోవడం మరియు భార్యాభర్తల మధ్య భయంకరమైన గొడవలు చోటు చేసుకోవడం మరియు అదే విధంగా మనుషుల మధ్య దూరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలా ఉండగా ఉత్తరప్రదేశ్ లో ఇంటర్నెట్ లో జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. విషయం ఏమిటంటే గతంలో పెళ్లి బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఘనంగా చేసుకునేవాళ్లు ఇప్పటికీ చేసుకుంటున్నారు.
 
అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యూపీలోని గోండాకు చెందిన రాధాకుండ్ ప్రాంతంలో ఉండే మహ్మద్ అలీమ్ తనకూతురు అక్బరీకి వివాహం చేయాలని నిశ్చయించాడు. కర్నౌల్ జంగ్ ప్రాంతానికి చెందిన లియాతక్ అలీ కొడుకు రమ్జాన్ అలీతో నిశ్చితార్ధం జరిపించారు. ఆ తరువాత పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు. రమ్జాన్ అలీకి దుబాయ్ లో ఉద్యోగం. పెళ్లి రోజుకు ఎలాగైనా ఇండియాకు చేరుకుంటానని అన్నాడు. కానీ వీసా సమస్య తలెత్తింది. దీంతో పెద్దలు అనుకున్న సమయానికి పెళ్లి జరగలేదు. ఇదే క్రమంలో పెళ్లి కార్డు లో సరైన తేదీ సరైన సమయం నిద్రించారు...అయితే వీసా సమస్య తలెత్తడంతో రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు.
 
పెళ్లి వాయిదా పడకూడదని భావించి.. టెక్నాలజీ సాయం తీసుకున్నారు. వెంటనే రమ్జాన్ అలీకి ఫోన్ చేసి వీడియో కాల్లోకి తీసుకున్నారు. బంధువులందరి సమక్షంలో పెళ్లి కూతురిని కూర్చొబెట్టారు. పెళ్ళికొడుకును ఆన్ లైన్ చిత్రాన్ని ఆమె ఎదురుగా ఉంచారు. ఇద్దరూ ఆన్ లైన్ లో ఉండగానే ముస్లిం మత పెద్ద నిఖా చదివారు. పెళ్లి కి ఇద్దరు అంగీకారం తెలపడంతో నిఖా తతంగం ముగిసింది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top