అప్పుడే నందమూరి సుహాసిని కి నిరసన సెగ .. షాక్ లో బాబు !

By Xappie Desk, November 17, 2018 13:00 IST

అప్పుడే నందమూరి సుహాసిని కి నిరసన సెగ .. షాక్ లో బాబు !

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి కుమారుడు చైతన్య రధ సారధి నందమూరి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. దీంతో టిడిపి జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో జరగబోతున్న రెండు అసెంబ్లీ ఎన్నికలలో నందమూరి హరికృష్ణ గారి కూతురు అయినా నందమూరి సుహాసిని ని రంగంలోకి దింపి ఒక స్థానాన్ని కైవసం చేసుకోవాలని..తెలంగాణ ప్రాంతంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న క్రమంలో నందమూరి హరికృష్ణ గారి కూతురు సుహాసిని ని ఇక్కడ నుండి రంగంలో కి దింపి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవలన్ని చంద్రబాబు వేసిన ప్లాన్ కి కూకట్ పల్లి టి కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు.
 
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేయడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
 
గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని సర్వేలలో కాంగ్రెస్ పార్టీకే ప్రజాధరణ ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో రానున్న ఎన్నికలలో కుకట్ పల్లి స్థానం కాంగ్రెస్ పార్టీ కే ఇవ్వలన్ని అంటున్నారు కుకట్ పల్లి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులూ. దీంతో ఈ విషయం మొత్తం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో షాక్ లో ఉన్నారు చంద్రబాబు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Top