రేవంత్ ఓటమి కోసం కేసీఆర్ అదిరిపోయే స్కెచ్ !

రేవంత్ ఓటమి కోసం కేసీఆర్ అదిరిపోయే స్కెచ్ !

కొడంగల్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని చిత్తు చేసేందుకు కేసీఆర్ బ్రహ్మాండమైన వ్యూహం పన్నారు. ఆయన్ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుందా ఎన్నో స్కెచ్ లు వేస్తున్నారు. ఏడాది కాలంగా ఈయన ఎంతో పకడ్బందీగా పన్నాగాలు పన్నుతూ వస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే గత ఏడాదిన్నర లో కొడంగల్ కు 300కోట్ల భారీ నిధులు మంజూరు చేశారట. రేవంత్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు కేసీఆర్.
 
కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో చేస్తున్న లోపాలను ఆయన అసెంబ్లీలో ఎండగట్టారు. అలాగే రేవంత్ రెడ్డి తో అసెంబ్లీలో పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ మరియు హరీష్ రెడ్డి లకు తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకున్న సందర్భాలు బోలెడు. అయితే నోటు కు ఓటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు నమ్మిన బంటుగా చెప్పబడే రేవంత్ రెడ్డితో ఎప్పటికైనా డేంజర్ అని భావించిన కేసీఆర్ ఈ సారి అతనిని అసలు అసెంబ్లీ గడప తొక్కనివ్వకూడదని భావిస్తున్నాడు. తాజాగా రేవంత్ రెడ్డి ఇంట్లో సోదా చేసిన విషయం తెలిసిందే.
 
ఇప్పుడు కొడంగల్ లో అతనికి ధీటుగా మంత్రి మహేందర్ రెడ్డి తమ్ముడు నరేంద్ర రెడ్డిని తమ పార్టీ తరుపున నిలబెడుతున్నాడు. ఎలాగైనా అక్కడ టీఆరెఎస్ గెలిచే బాధ్యతలను హరీష్ రావు మరియు మహేంద్ర రెడ్డి పైన వేసారు కేసీఆర్. ముందస్తు చర్యగా ఈ నియోజకవర్గానికి 300 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు అక్కడ ఎలాగైనా తనని ఓడించాలని ఇంకొక 100 కోట్లు కర్చుపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని ఇటీవలే రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. ఈ ప్రకటనలో వాస్తవం ఎంటున్నా పోరు మాత్రం గట్టిగా ఉండబోతుంది అన్నది స్పష్టం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top