మోదీకి రివర్స్ పంచ్ వేసిన బాబు - అదరహో !

మోదీకి రివర్స్ పంచ్ వేసిన బాబు - అదరహో !

కేంద్రం తన రాజకీయ స్వలాభాలకోసం సిబిఐ లాంటి అత్యుత్తమ దర్యాప్తు సంస్థలను వాడుకుంటుంది. అయితే ఈ విషయం పై చంద్రబాబు మోడీకి రివర్స్లో గట్టిగానే పంచ్ ఇచ్చాడు. ఇకపై సీబీఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం లేదని బాబు తెగేసి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ మీ ఇష్టారాజ్యం కాదని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్గత కుమ్ములాటలతో రచ్చకెక్కిన కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్రం షాక్‌ ఇచ్చింది. ఇక పై రైల్వే పరిధిలోకి వచ్చే భూభాగం తప్పించి రాష్ట్రంలో ఇకపై సీబీఐ ఎక్కడా సోదాలు చేయడానికి వీళ్లేదు.
 
మోదీ సర్కారు ఇలాగే తన స్వార్థ ప్రయోజనాల కోసం అత్యున్నత దర్యాప్తు సంస్థని వాడుకొని బీహార్ లో లాలూ ప్రసాద్ ను వెంటాడి జైలుకు పంపించింది. ఈ మధ్య ఏపీ లోని రాజకీయ నాయకుల పైన సీబీఐ, ఐటీ దాడులు మరీ విస్తృతం అయ్యాయి. మోదీ ఇలాంటి సంస్థలను వాడుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూశాడు. అయితే బాబు దీనికి రెండింతలు సౌండ్ వచ్చేలా బదులిచ్చాడు. ఇక పై రాష్ట్రంలో రైల్వే విభాగానికి సంబంధించిన వారికి తప్పించి మిగతా అన్నీ చోట్ల కేవలం ఏసీబీ మాత్రమే విచారణ చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేసింది.
 
అదే ఐటీ అధికారులు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే... రాష్ట్రానికి చెందిన ఏసీబీ రంగంలోకి దిగి చర్యలు తీసుకోవచ్చు. అంటే ఐటీ అధికారులపై... ఏపీ ఏసీపీ అధికారులు కేసులు నమోదు చేసే అధికారం ఉందన్నమాట. ఇకపై ఎవరైనా టీడీపీ నేతలను అదే పనిగా టార్గెట్ చేసి జరిపే దాడులకు ఆయన చెక్ పెట్టెలాగా ఆయన ఇన్ని రోజులు వారి పనులపై ఒక కన్ను వేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పెద్ద పెద్ద సంస్థల అండ చూసుకుని మోడీ రెచ్చిపోయాడు. జీవీఎల్ లాంటి వాళ్లు దాన్నే ... బూచిగా చూపి భయపెట్టడానికి ప్రయత్నించేవాళ్లు. ఉద్యోగులను బెదిరించేవాళ్లు. ఇప్పుడుసీన్ రివర్స్ అయింది. వారిని మించిన అధికారం తమ దగ్గర ఉందని చంద్రబాబు చూపించారు. ఇక బీజేపీ మూసుకోవాల్సిందేగా మరి.... దుకాణం!
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop