చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై రెచ్చిపోయిన ఉండవల్లి ..!

By Xappie Desk, November 17, 2018 21:26 IST

చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై రెచ్చిపోయిన ఉండవల్లి ..!

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర దర్యాప్తు సంస్థ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దర్యాప్తు చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అన్ని ఆదేశాలు జారి చేశారు. దీంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అటూ జాతీయ నాయకులూ ఇటూ రెండు తెలుగు రాష్ట్రాల పెద్దలు షాక్ తిన్నారు. ఈ నేపద్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో చంద్రబాబు పై స్పందించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకునే సీబీఐ రావాలి అంటూ టీడీపీ సర్కార్ తీసుకువచ్చిన జీఓ టిష్యూ పేపర్‌తో సమానమని.. అది చెల్లదని ఉండవల్లి అన్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని తెగ అదరగొట్టే చంద్రబాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై సీబీఐ నేరుగా దాడులు చేయవచ్చునని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఇక ప్రజా సమస్యల కోసం కోర్టు ఆదేశిస్తే సీబీఐ తప్పనిసరిగా రంగంలోకి దిగుతుందని ఉండ‌వ‌ల్లి చెప్పారు. తాను నిప్పులాంటి నాయ‌కుడని చెప్పుకునే చంద్ర‌బాబు సీబీఐకి భ‌య‌ప‌డ‌డం ఏంట‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతుందని వెంటనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు ఉండవల్లి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top