చింతమనేని ప్రభాకర్ కి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!

చింతమనేని ప్రభాకర్ కి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!

తెలుగుదేశం పార్టీ వివాదాస్పద శాసనసభ్యుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరినో ఒకరిని కొట్టడం లేకపోతే దూషించడం  ఇటీవల జర్నలిస్టులపై దారుణంగా నోరుపారేసుకోవడం తో ఆంధ్రాలో టీడీపీకి తలనొప్పిగా మారిన చింతమనేని ప్రభాకర్ కి చంద్రబాబు స్పెషల్ గా పిలిచి మరీ చివాట్లు పెట్టారు. ఇటీవల ఓ వ్యక్తిపై చింతమనేని అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు చింతమనేనిపై కేసు కూడా నమోదైంది. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడంలేదని చింతమనేనిపై మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పుకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో నువ్వే తెలుసుకోవాలి అంటూ భవిష్యత్తు లేకుండా చేస్తానని సీఎం చంద్రబాబు.. చింతమనేని ప్రభాకర్ కి తనదైన శైలి లో వార్నింగ్ ఇచ్చారట 
<div. 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top