భవిష్యత్తులో ఏపీ అసెంబ్లీ తాజ్ మహాల్ లా ఉంటుంది: చంద్రబాబు

By Xappie Desk, November 17, 2018 21:36 IST

భవిష్యత్తులో ఏపీ అసెంబ్లీ తాజ్ మహాల్ లా ఉంటుంది: చంద్రబాబు

ఏపీ అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యాటకంగా అభివృద్ధి జరగాలని ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో విజయవాడ ప్రాంతంలో కృష్ణా నదిలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియా ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు బోట్ రేసింగ్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. కుటుంబ సమేతంగా చంద్రబాబు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మరియు అదేవిధంగా ఏపీ మంత్రులు కూడా హాజరయ్యారు. ఎఫ్‌1 హెచ్‌2 వో సీ బోటు రేసింగ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ కూడా  సీ బోటును నడుపుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. ఎఫ్‌1 హెచ్‌2 వో పోటీలు అమరావతిలో నిర్వహించడం సంతోషకరంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఎఫ్‌1 హెచ్‌2 వో పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. తాజ్‌మహల్‌ అంత అందమైన అసెంబ్లీని నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అడ్వెంచర్‌ టూరిజానికి ఏపీ ఐకాన్‌గా మారనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో బోట్ రేసింగ్ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయి అని పేర్కొన్నారు. ఈ పోటీలకు పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారి కి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు. మరియు అదే విధంగా బోట్ రేసింగ్ పోటీలలో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ తాతా చంద్రబాబుతో కొద్దిసేపు బోట్ రేసింగ్ చేయడంతో అక్కడున్న ప్రజలు ఆ సన్నివేశాన్ని చూసి పులకరించిపోయారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop