అన్ని నియోజికవర్గాల్లో కాంగ్రెస్ ని దారుణ పోటు పొడిచిన రెబల్స్ !

అన్ని నియోజికవర్గాల్లో కాంగ్రెస్ ని దారుణ పోటు పొడిచిన రెబల్స్ !

మరో ఆరు స్థానాలకు మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపుగా ఖరారు అయ్యారు . ఎనభై ఎనిమిది నియోజకవర్గాలకు ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆది వారం నామినేషన్లకు అవకాశం ఉండదు. ఒక సోమవారం మాత్రమే ఛాన్స్ ఉంటుంది. బహుశా ఆదివారం ఈ ఆరు మంది తో కూడిన జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయవచ్చు.
 
నామినేషన్ల తుదిగడువుకు ఒక్క రోజు ముందు కానీ.. కాంగ్రెస్ పార్టీ తన జాబితాను తయారు విడుదల చేయలేకపోయింది. కనీసం ఇప్పటికైనా అనౌన్స్ చేశారులే.. అని ఆ పార్టీనేతలు అంటున్నారు. ఇక రెబల్స్ పోటు కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే కనిపిస్తూ ఉంది,ఎంతలా అంటే,., కనీసం నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబల్స్ పోటీలో ఉంటారని తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఒకరికి మించి ఆశించారు. ప్రతి చోటా ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ విషయంలో పోటీలు పడ్డారు, దీంతో వారిలో టికెట్ ఎవరికో తేల్చడానికి హై కమాండ్ కు కూడా చాలా సమయమే పట్టింది. ఒకరికి ప్రాధాన్యత ఇస్తే మరొకరికి కోపం. దీంతో రెబల్స్ పోటు తప్పడం లేదు.
 
ఇక మహాకూటమి కూడా కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. తమను కాదని,. తెలుగుదేశం లేదా టీజేఎస్ లకు ఆయా సీట్లను కేటాయించడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఇండిపెండెట్స్ గా పోటీ చేస్తామని వారు ప్రకటించేశారు.
 
ఏతావాతా నలభై నియోకవర్గాల్లో కాంగ్రెస్ కు రెబల్స్ పోటీ కనిపిస్తోంది, అటు కాంగ్రెస్ ను, ఇటు మహాకూటమిని ఈ రెబల్స్ టెన్షన్ పెడుతున్నారు. మరి వీరు ఫలితాలను కూడా మార్చేస్తారేమో చూడాలి!
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top