ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఫోన్ !

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఫోన్ !

ఆమె ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి… 39 ఏళ్ల కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని కూల్చి గెలిచి… నిలిచిన నేత. కాలం కలిసి వస్తే ప్రధాని కావాలని కలలు కంటున్న నేత. నిండా మోడీ వ్యతిరేకత నింపుకుని దానిని ఎలా బయటపెట్టాలో తెలియక… మోడీని ఎదుర్కొనే మార్గం దొరక్క ఇన్నాళ్లుగా తనలో తానే రగిలిపోతున్న నేత. తన రాష్ట్రంలో వేలు పెట్టి నిత్యం సతాయిస్తున్నా కిమ్మనలేక కూర్చున్న సీఎం. అలాంటి నేతకు ఇన్నాళ్లకు చంద్రబాబు రూపంలో ఒక ఆలంబన దొరికింది. ఇంకేముంది బాబు నువ్వే మాకు ఆదర్శం ఆంటూ ఆంధ్రా బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఆమే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సీబీఐని రాష్ట్రంలోకి రనివ్వవద్దంటూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి… చంద్రబాబు రాజకీయ చాణక్యానికి మమతా ఫిదా అయ్యారు. అదను చూసి దెబ్బ మీద దెబ్బ కొడుతున్న చంద్రబాబు వెంట నడవాలని అప్పుడి మోడీని తాము ఎదుర్కోగలమని మమతా ఒక నిర్ణయానికి వచ్చారు.
 
ఆ క్రమంలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు శనివారం ఫోన్‌ చేశారు. మోడీ ప్రభుత్వం సీబీఐని రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకుంటోందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదంటూ ఆయన ఉత్తర్వులివ్వడాన్ని కొనియాడారు. బెంగాల్లో కూడా జనరల్‌ కన్సెంట్‌(సాధారణ అనుమతి)ను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను మోడీ దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కాగా.. చంద్రబాబు మమతను కలిసేందుకు సోమవారం(19న) కోల్‌కతా వెళ్తున్నారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటు ప్రయత్నాలపై ఆమెతో చర్చిస్తారు. అలాగే ఈ నెల 22న బీజేపీయేతర పార్టీలతో ఢిల్లీలో చంద్రబాబు భేటభేటీకానున్నారు. ఏపీ బాటలోనే పశ్చిమ బెంగాల్‌ పయనించింది. సీబీఐకి బెంగాల్‌ ప్రభుత్వం ఇచ్చిన జనరల్‌ కన్సెంట్‌ను రద్దుచేస్తూ శనివారం ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అ త్రి భట్టాచార్య ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ జీవోను సీబీఐకి కూడా పంపారు. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌-1946 కింద ఉండే సీబీఐ ఇకపై నేరుగా తమ రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక తమ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సమర్ధించారు. సీబీఐలో నెలకొన్న సంక్షోభ పరిస్ధితుల వల్లే ఏపీలో ఆ సంస్థకు సాధారణ సమ్మతిని ఉపసంహరించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ రాష్ట్రాలకు ఉన్న అధికారాలు, చట్ట పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 
ఇది సబబైన నిర్ణయం కాబట్టే మరికొన్ని రాష్ట్రాలు ఏపీని అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు. ‘రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ సాధనం కాకూడదు. ప్రధాని మోడీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సంస్థను ఒక పనిముట్టుగా వాడుకునే ప్రయత్నం చేసి దాని ప్రతిష్ఠను దెబ్బతీశారు. సీబీఐ డైరెక్టర్‌, అదనపు డైరెక్టర్‌ పరస్పర ఆరోపణలు చేసుకోవడం ఎప్పుడైనా చూశా మా? సీవీసీ, ప్రధాని కార్యాలయంపై సీబీఐ డైరెక్టర్‌ ఆరోపణలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అవినీతి కేసుల్లో ఏ1, ఏ2గా ఉన్న వ్యక్తులు ప్రధాని కార్యాలయంలో స్వేచ్ఛగా తిరగడం గతంలో చూశామా? ఈ పరిస్థితులే సీబీఐపై రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు’ అని యనమల స్పష్టం చేశారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop