మోడీ కి ముచ్చటగా మూడో షాక్ !

By Xappie Desk, November 18, 2018 16:00 IST

మోడీ కి ముచ్చటగా మూడో షాక్ !

నేనే రాజు అని నాలుగేళ్లుగా అన్నిటినీ గుప్పిట్లో పెట్టుకున్న ప్రధాని మోడికి షాకిచ్చే నేత వచ్చారు. నిన్ను గద్దె దించుతా అని నేరుగా ఢిల్లీ వీధుల్లోనే సవాలు విసిరి నాయకుడు వచ్చారు. ఇవే ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలో ఉన్న అంశాలు. మోడీని ఢీకొట్టాలని నిర్ణయించుకున్న. ఆంధ్రా సీఎం చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ ని కలిసిన తర్వాత మొదలైన రాజకీయ పునరికీకరణ గురించి తెలిసిందే. ఇది చంద్రబాబు విసిరిన తొలి పంజా. ఆ దెబ్బకు మోడీని వ్యతిరేకించే దాదాపు 15 పార్టీలు నాలుగు రోజుల్లో చంద్రబాబుతో పని చేయాలని నిర్ణయించాయి. దాంతో బిత్తర పోయిన మోడీ తానే పక్కన పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్యను కిలిసి వచ్చారు. ఇక సీబీఐని చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవలన్న మోడీకి ప్రభుత్వానికి ఒక్క అదేశంతో చంద్రబాబు చెక్ పెట్టారు. ఇది దేశవ్యాప్తంగా మోడీ వల్ల ఇబ్బంది పడ్డ ప్రభుత్వాలకు ఆయుధంగా మారింది.
 
పలు ప్రభుత్వాలు ఇదే విధంగా సీబీఐని రనివ్వం అని ఆదేశాలు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం దిగ్బ్రాంతికి గురైంది. అందుకే అరుణ్ జైట్లీ పసలేని ఆరోపణలు చేశారు. అయితే ఆ షాక్ లోంచి అసలు నిజాన్ని చెప్పారు. చంద్రబాబు మీద ఏదో చేయబోతున్నామని భయపడి ఇలాంటి ఆదేశాలు ఇచ్చారని జైట్లీ అన్నారు. తద్వారా తాము చేస్తున్న కుట్రను తానే బయట పెట్టుకున్నారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం మోడీ సర్కారును ఎంతగా కదిలించిందో దీనితో తేలిపోయింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో బాంబు పేల్చడానికి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఇదే జరిగితే ఇక మోడీ సర్కారు చేతులు కట్టేసినట్లే. అవినీతిపరులు, పన్ను ఎగవేతదారులపై దృష్టిపెట్టాల్సిన సంస్థల్ని …మోడీ సర్కారు తమ ప్రత్యర్థి పార్టీలపైకి మళ్లిస్తోందన్న ఆరోపణ వినిపిస్తోంది. విమర్శలే కాదు..ఇవి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరూపితం అయ్యాయి కూడా. దీనికి చెక్ పెట్టాలని పలు పార్టీలు స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. దీని వెనుక మాస్టర్ మైండ్ కూడా చంద్రబాబే. ఎన్నికలకు ఆరునెలల ముందు కేంద్ర దర్యాప్తు వ్యవస్థల్ని నియంత్రించాలన్న డిమాండ్‌ను పలు రాజకీయ పార్టీలు లేవనెత్తనున్నాయి. ఈ విషయంలో వెనక్కి తగ్గొద్దని, చివరకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికీ వెనుదీయరాదని గట్టిగా భావిస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒక ఆలోచన కూడా జరిగిందని తెలిసింది. దేశంలోని ప్రతి వ్యవస్థనూ మోదీ ప్రభుత్వం తన గుప్పిట్లోకి తెచ్చుకుందని, ఈడీ, ఐటీ శాఖలను కూడా ఇదేవిధంగా చేసిందని పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నియంత్రణలో ఈడీ, ఐటీలు ఉంటాయి. అయితే సీబీడీటీ నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది.
 
దేశంలో అక్రమార్కులు, పన్ను ఎగవేతదారులపై దాడులకు, వారి పని పట్టేందుకు ఉన్న ఈ వ్యవస్థలు…ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసే అస్ర్తాలుగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రత్యర్థులు కదలకుండా, వారి ఆర్థిక వ్యవహారాల్ని ఛిన్నాభిన్నం చేసి..వాటిలోంచి తేరుకునే లోపు ఎన్నికల్లో గట్టెక్కాలన్న వ్యూహంతో కేంద్రం వెళ్తోందని పలు రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపైనా, వారికి ఆర్ధిక సహకారం అందించేవారిపై ఐటీ, ఈడీ సంస్థలు దాడులు జరిగాయి. తమిళనాడులో అధికార రాజకీయాల్ని తమ చేతిలోకి తీసుకోవడానికి, అక్కడా ఐటీ దాడులు చేయించారనే ఆరోపణలున్నాయి. గుజరాత్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నెహ్రూ-గాంధీల కుటుంబానికి సన్నిహితుడు అహ్మద్‌ పటేల్‌ పోటీచేసినప్పుడు…అతన్ని ఓడించేందుకు కూడా ఈడీ, ఐటీ సంస్థల్ని ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో పెద్దఎత్తున ఐటీ దాడులు చేశారు. నేరుగా తెలుగుదేశం పార్టీ నేతలు, వారి మద్దతుదారులపైనే ఈ దాడులను కేంద్రీకరించడం గమనార్హం. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, బీద మస్తాన్‌రావు తదితరులపై ఐటీ దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు తెలంగాణలోను దేవేందర్‌గౌడ్‌ కుమారులు డైరక్టర్లుగా ఉన్న కంపెనీపై దాడులు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఐదేళ్ల సమయం ఉన్నా…కేవలం ఎన్నికల ముందే దాడులకు పాల్పడడం వెనక రాజకీయ కుట్రే కారణమని పలు పార్టీలు వాదిస్తున్నాయి. అందుకే ఎన్నికలకు ఆరునెలల ముందు ఈడీ, ఐటీ లాంటి సంస్థలను నియంత్రించాలని సుప్రీంకోర్టులో కేసు వేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఇక మోడీ ప్రభుత్వం ఆటలకు అడ్డుకట్ట పడినట్లే.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop