హాయిలాండ్ దోచేయాలని బాబు లోకేష్ ప్రయత్నాలు అంటున్న వైసీపీ నేత బొత్స

By Xappie Desk, November 19, 2018 10:28 IST

హాయిలాండ్ దోచేయాలని బాబు లోకేష్ ప్రయత్నాలు అంటున్న వైసీపీ నేత బొత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 16 లక్షల మంది ఇప్పటికే తమ సొమ్మును చెల్లించాలని అనేకసార్లు ధర్నాలు దీక్షలు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో బాధితులు మరింతగా త్వరగా ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు కలుగ చేసుకోవాలని మీడియా ముందు వస్తున్న క్రమంలో వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరియు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ పై సంచలన కామెంట్లు చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సొమ్మును మరియు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులను చంద్రబాబు నారా లోకేష్ దోచుకోవాలని వస్తున్నారని వైసీపీ నేత బొత్స ఆరోపించారు.
 
గత కొంత కాలం నుండి వైసీపీ పార్టీ ఈ విషయాన్ని చెబుతున్న టిడిపి నుండి ఎటువంటి స్పందన రాకపోవడం దారుణమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అగ్రిగోల్డ్ బాధితులకు గతంలో జగన్ విజయవాడ ప్రాంతంలో ఏ విధమైన హామీ ఇచ్చారో..దానికి కట్టుబడి ఉన్నారని..వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిన చంద్ర బాబునాయుడు ఇప్పటికే వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని, అది చాలక అగ్రిగోల్డ్ బాధి తుల సొమ్మును దోచేయాలని చూడటం బాధాకరమన్నారు. హాయ్‌ల్యాండ్ భూముల రికార్డులు తారుమారు చేసి ఆ ఆస్తిని కాజేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. అమరావతితో పాటు విశాఖలో కూడా భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ ఆస్తులు మావి కావని ఆ సంస్థ యాజమాన్యం చెప్పడం, ఆ ఆస్తులు మావేనని ఇంకో ప్రైవేట్ సంస్థ ముందుకు రావడం ఇదంతా కోర్టు వేలం ప్రకటన తరువాత జరగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.Top