జగన్ హత్యాయత్నం కేసు విషయమై చంద్రబాబుకి చీవాట్లు పెట్టిన సిపిఐ నేత రామకృష్ణ..!

జగన్ హత్యాయత్నం కేసు విషయమై చంద్రబాబుకి చీవాట్లు పెట్టిన సిపిఐ నేత రామకృష్ణ..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన కత్తి దాడి గురించి జగన్ ఎందుకు వివరంగా పోలీసు వ్యవస్థ అసలు వివరాలు బయటకు చెప్పడం లేదని..పోలీస్ వ్యవస్థ నిద్ర పోతుందా అంటూ ప్రశ్నించారు రామకృష్ణ. ఇటీవల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో టిడిపి నాయకులు సిగ్గులేకుండా మాట్లాడారు అని..ముఖ్యంగా జగన్ తల్లి చెల్లి ని ఈ విషయంలో లాగి టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మనుషుల ప్రవర్తించలేదని విమర్శించారు. అంతేకాకుండా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత పై హత్యాయత్నం జరిగితే ఎందుకు పరామర్శించలేదని చంద్రబాబుని ప్రశ్నించారు రామకృష్ణ.
 
రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు రావడానికి చంద్రబాబే కారణమని..రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు పోలీసుల అదుపులో లేవని పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తి దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమ కరువుపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం ఏమీ చేయలేదు..ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్ ఎక్కడో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఉండే వరవరరావు మోదీని ఎలా చంపుతారో వాళ్లే చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని చేస్తున్న దీక్షలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top