మమతా బెనర్జీతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు..!

By Xappie Desk, November 19, 2018 10:58 IST

మమతా బెనర్జీతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు..!

దేశంలో మోడీ హయాంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు అంటూ మరియు సామాన్య ప్రజలు బిజెపి హయాంలో నలిగిపోతున్నారు అంటూ ఇందుకోసం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి పనిచేయాలని చంద్రబాబు ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసినప్పుడు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. దేశంలో రానున్న ఎన్నికల్లో మోడీని ఎన్డీయే ను గత చంపడమే లక్ష్యంగా ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ మరియు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ రాజకీయ నేతలను కలవడం జరిగింది.
 
ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తో భేటీ అవ్వడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో చంద్రబాబుతో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతో సమావేశమయ్యే చంద్రబాబు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీబీఐని నిలువరించేందుకు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న చట్టాలపైనా వీరిద్దరి మధ్యా చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది. ఆపై రాత్రికి ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, పలు బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలిసి, కూటమి ఏర్పాటుపై చర్చించనున్నాట్లు సమాచారం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top