ఏపీ సీఎం చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా భర్త..!

ఏపీ సీఎం చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా భర్త..!

వైసిపి ఫైర్ బ్రాండ్ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఇటీవల తన జన్మదినోత్సవ వేడుకలను వైసీపీ పార్టీ నాయకుల మధ్య మరియు కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మరియు ఆమె భర్త సెల్వమణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. సెల్వమణి మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు పై షాకింగ్ కామెంట్ చేశారు. గతంలో ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి మాట్లాడని సెల్వమణి ఘాటుగా బాబుపై విమర్శలు చేయడంతో ఏపీ రాష్ట్రంలో రోజా భర్త సెల్వమణి చేసిన వాక్యాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడానికి పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడిన చంద్రబాబును సిగ్గు శరం లేని చంద్రబాబు అంటూ సెల్వమణి సంచలన విమర్శలు చేశారు. తనకు గతంలో తెలిసిన చంద్రబాబుకు, ఇప్పుడు చూస్తున్న చంద్రబాబుకు ఎంతో తేడా ఉందని, ఆయన నమ్మక ద్రోహని అన్నారు. 14 సంవత్సరాల క్రితం తనకు చంద్రబాబంటే అభిమానం ఉండేదని, 2014లో ఆయన నిజ స్వరూపం చూసి, అప్పటి నుంచి అసహ్యించుకుంటున్నానని అన్నారు. వైకాపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సర్కారు నరకం చూపిస్తోందని సెల్వమణి ఆరోపించారు. రాజకీయాలు దిగజారిపోవడానికి ఇటువంటి వ్యక్తులే కారణమని పేర్కొన్నారు సెల్వమణి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top