కేసీఆర్ మరియు కేటీఆర్ ల పై ఎవరు ఊహించని విధంగా కామెంట్లు చేసిన బాబు మోహన్..!

By Xappie Desk, November 19, 2018 12:21 IST

కేసీఆర్ మరియు కేటీఆర్ ల పై ఎవరు ఊహించని విధంగా కామెంట్లు చేసిన బాబు మోహన్..!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు మరీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ప్రచారపర్వంలో మహా కూటమి మరియు టిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు కారణంగా చేసుకుంటున్న నేపథ్యంలో బిజెపి నాయకులు కూడా బరిలోకి దిగి పోయారు. తాజాగా బిజేపి నాయకుడు బాబు మోహన్ టిఆర్ఎస్ పార్టీ పెద్దల పైన దారుణంగా విమర్శలు చేశారు..కెసిఆర్ మరియు ఆయన తనయుడు కేటీఆర్ ని టార్గెట్ చేసి మరి విమర్శల వర్షం కురిపించారు బాబు మోహన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సంగారెడ్డి లో పర్యటించిన బాబు మోహన్ మాట్లాడుతూ...కట్టు కథలు, పిట్ట కథలు, సూది కథలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు పులిహార మాటలు చెప్పడం లో కేసిఆర్ మించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో లేరని విమర్శించారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం టిఆర్ఎస్ పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు కాల్ టు ఆరోపణలు చేశారు. చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మునే తమ అభ్యర్థులకు ఆయన ఇస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా మద్యం సరఫరా చేసేందుకు లారీల్లో దిగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏటువంటి దోపిడీ వ్యవస్థ నడుస్తుందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కెసిఆర్ కి గట్టిగా  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు బాబు మోహన్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop