బాలకృష్ణ పై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేసిన విజయసాయిరెడ్డి..!

బాలకృష్ణ పై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేసిన విజయసాయిరెడ్డి..!

ఏపీ సీఎం చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ పై వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో దారుణమైన విమర్శలు చేసింది. దీంతో విజయసాయి రెడ్డి చేసిన విమర్శలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే రెండో అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చివరిగా 2014 ఎన్నికల వరకు కుక్కట్ పల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట గా ఉంది. ఈ నేపద్యం లో మహా కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దింపడం జరిగింది..ఇదే క్రమంలో సుహాసిని కూడా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..నంద‌మూరి కుటుంబం నుండి వస్తున్న ఆడ‌ప‌డుచు సుహాసినిని గెలిపించే బాధ్య‌త మీదే అని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా త‌న అన్న నంద‌మూరి హ‌రికృష్ణ గారిఅకాల మరణం అందరిని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిందని బాల‌య్య అన్నారు. దీంతో సంభ్రమాశ్చర్యం అనే పదాన్ని క్యాచ్ చేసిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి బాల‌కృష్ణ పై విమ‌ర్శ‌లు వాన కురింపించారు.
 
మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరంతో కూడిన ఆశ్చర్యం కలిగించిందా.. బాల‌కృష్ణ‌, నిజ‌మేలే..తండ్రికి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా మీది... కుటుంబ సభ్యలు మరణిస్తే ఆనందం కలుగుతుందా.. నిజమే మాట్లాడావయ్యా బాలయ్యా అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top